కోట్లు కూడబెట్టిన కీర్తి సురేష్.. మహానటి ఆస్తి ఎన్ని కోట్లంటే?

కోట్లు కూడబెట్టిన కీర్తి సురేష్.. మహానటి ఆస్తి ఎన్ని కోట్లంటే?

by kavitha

Ads

సిని ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ ఉండేది తక్కువ కాలం అని చెప్పవచ్చు.  అందువల్ల వారి చేతిలో  ఆఫర్స్ ఉన్నప్పుడే సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలని ఆరాట పడుతుంటారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్నది వెనుకటి మాట.

Video Advertisement

ఫేమ్ లో ఉండగానే 4 రాళ్లు సంపాదించుకోవాలనేది నేటి సామెత అనవచ్చు.  ఈ విషయాన్ని హీరోయిన్లు ఎక్కువగా పాటిస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు ఫ్లాట్స్, స్థలాలు కొనుగోలు చేయడం, లేదా బిజినెస్ లలో పెట్టుబడి పెట్టడం లాంటివి చేస్తున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న ఇతర భాషల హీరోయిన్లు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ హైదరాబాద్‌లోనూ ఇళ్లు కొనుక్కున్నారు. అయితే తాజాగా మహానటి కీర్తి సురేష్ ఆస్తుల గురించిన వార్త మీడియాలో మరియు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కీర్తి సురేష్ ‘నేను శైలజ’ అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆమె తొలి చిత్రంతోనే తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ‘మహానటి’ మూవీతో కీర్తి సురేష్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఈ చిత్రంలో కీర్తి అచ్చం మహానటి సావిత్రిలాగే నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డు అందుకుంది. ఈ మూవీ నుండి కీర్తి సురేష్ ని మహానటి అని పిలుస్తున్నారు. స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిన కీర్తి  ఒక్కో సినిమాకి  2-3 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమె భారీగా ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం కీర్తి సురేష్ యాబై కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టిందంట. కీర్తి సురేష్ యాడ్స్ లో కూడా నటిస్తోంది. ఒక్కో యాడ్ కి 15-30 లక్షల వరకు తీసుకుంటునట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రిలయన్స్ ట్రెండ్స్ మరియు  జోస్ అలుక్కాస్ లకు ప్రచారకర్తగా ఉంది. ఆమె చెన్నైమరియు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉందట. అంతేకాక ఆమె త్వరలో వివాహం చేసుకోబోతుందని తెలుస్తోంది. పెళ్లి గురించి చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో 6 చిత్రాలు ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా గురించి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ వీలైనంత తొందరగా పూర్తి చేయమని కోరిందట. అలాగే ఆమె నటిస్తున్న మిగతా సినిమా మేకర్స్ ను కూడా  కూడా త్వరగా షూటింగ్  పూర్తి చేయాలని కోరినట్టు సమాచారం. ఆమె కొత్త చిత్రాలకు అంగీకారం చెప్పట్లేదని తెలుస్తోంది. హీరో నానితో నటించిన ‘దసరా’ మూవీ మార్చి 30న రిలీజ్ కానుందిAlso Read: “పవన్ కళ్యాణ్” లాగానే… తమ సినిమాలని తామే “డైరెక్ట్” చేసుకున్న 10 హీరోస్..!

https://www.instagram.com/p/CqAvpu9pxkT/?hl=en

 


End of Article

You may also like