Ads
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న ముఖ్యంగా ఇటీవల ఈడి అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తూ పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతవారం టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నటువంటి అధికారులు తాజాగా కేజ్రీవాల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈయన నివాసంలో దాదాపు 2గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ లాక్కున్నారు. ఇంటి బయట భారీగా పోలీసులు మోహరించారు. కేజ్రీవాల్ ఇంటి వెలుపల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించారు.
Video Advertisement
ఇక ఇంటి బయట కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ఇలా కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఈయనని అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే కేజ్రీవాల్ అరెస్టు కావడానికి కారణం ఏంటి అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి అనే విషయానికి వస్తే..నవంబర్ 17, 2021న ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని అమలు చేసింది. ఈ పాలసీ కింద ఢిల్లీలో 32 జోన్లు ఏర్పాటు చేసి ఒక్కో జోన్‌లో గరిష్టంగా 27 దుకాణాలు తెరవాలి. ఈ స్కామ్ ప్రకారం ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలను కూడా ప్రైవేటీకరణ చేశారు.
ఇలా ప్రైవేటీకరణ చేయడమే కాకుండా లైసెన్సులను పొందడం కోసం లైసెన్స్ ఫీజును కూడా భారీ స్థాయిలో పెంచేశారు. దుకాణం కోసం సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు లైసెన్స్ ఫీజు పెంచడంతో చిన్న కాంట్రాక్టర్లు ఈ స్థాయిలో లైసెన్స్ ఫీజు చెల్లించలేక దుకాణాలను మూసేశాయి. ఈ విధంగా లైసెన్స్ ఫీజుల ద్వారా భారీ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అంతేకాకుండా ఒక్కో మద్యం బాటిల్ పై సుమారు 30 నుంచి 50 రూపాయల వరకు రేటు కూడా పెంచేశారు. ఇలా మద్యం రేట్లు పెరగటం వల్ల రిటైల్ వ్యాపారులకు కూడా పది రెట్ల లాభాలు వచ్చాయి.
ఈ విధంగా లిక్కర్ స్కామ్ లో భాగంగా ఏర్పాటు చేస్తున్నటువంటి దుకాణాల ద్వారా భారీగా అవకతవకలు జరిగాయి అంటూ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన, విధానపరమైన అవకతవకలకు సంబంధించి 15 మంది నిందితులపై 2022 ఆగస్టులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంతేకాకుండా పీఎంఎల్ఏ కింద మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇలా ఈ కుంభకోణం విషయంలో ఈడీ అధికారులు ఒకవైపు సిబిఐ మరోవైపు దర్యాప్తులను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఇటీవల కల్వకుంట్ల కవితను అరెస్టు చేయగా తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారిలో ఎక్కువమంది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి నాయకులు కావడం గమనార్హం.
ALSO READ : IPL 2024 : ఈసారి ఐపీఎల్ లో కొత్త ట్విస్ట్… DRS లేదు…బదులుగా SRS..! ఇది ఎలా పని చేస్తుందో తెలుసా..?
End of Article