చైనాలో మొదలైన కరోనా వైరస్ మన దేశంలో మొట్టమొదటిగా తాకింది మాత్రం గాడ్’స్ ఓన్ కంట్రీ కేరళలోనే.దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అయ్యింది కూడా కేరళలోనే . కానీ అక్కడ పినరయి ప్రభుత్వం తీసుకున్న చక్కటి చర్యాలు మరియు చికిత్స విధానంతో కరోనా పేషెంట్స్ తొందరగా కోలుకుంటున్నారు ..దేశంలో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలుస్తూ అందారి ప్రశంసలు అందుకుంటున్నారు .

Video Advertisement

ఇదిలా ఉంటే పినరాయి విజయన్ కి అడుగడుగున ప్రసంశలు వెల్లువిరుస్తున్నాయి..తాజాగా 13 మంది అమ్మాయిలతో సహా ఒక టీం హైదరాబాద్ నుండి కేరళ ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో తెలియని ప్రదేశంలో చిక్కుకుపొయారు . ఒకరిద్దరి మొబైల్స్ తప్ప ఎవరివి పనిచేయట్లేదు అందరు ఏంచేయాలో తెలియక తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు .

ఎటు వెళ్ళాలో తెలియట్లేదు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు తీవ్ర సందిగ్ద పరిస్థితి ..ఈ పరిస్థితిలో తమను ముఖ్యమంత్రి పినారయి తప్పితే ఎవరు కాపాడలేరు అని నిశ్చయించుకున్నారు .సమయం అర్ధరాత్రి 1:30 అవుతుంది.ఒక చివరి ప్రయత్నంగా అనుకుని విజయన్ కు కాల్ చేద్దామనుకున్నారు ..ఒకవేళ ఈ టైములో కాల్ లిఫ్ట్ చేసిన తిడతారు అనుకున్నారు .

కానీ కాల్ లిఫ్ట్ చేసిన పినారయి విజయన్ సానుకూలంగా స్పందించారు.ముఖ్యమంత్రి అందులోనూ ఆ సమయంలో ఫోన్ కాల్ కి స్పందించడం అంటే మాములు విషయమా ? కానీ వారి నిరాశ నిస్పృహలు అన్ని కూడా క్షణలలో మాయమయ్యాయి . వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు జరిగిన విషయం తెలుసుకొని నిమిషాలలో సమస్యని పరిష్కరించారు .

 

తెలియని ప్లేసులో చిక్కుకున్న అమ్మాయిలు హైదరాబాద్ టాటా కన్సల్టెన్సీ ఉద్యోగులు . ముఖ్యమంత్రి గారు సమస్యని పరిష్కరించాక కేరళ చేరుకున్న అమ్మాయిలు చేతులు కడిగించి ఉష్ణోగ్రత చెక్ చేయించి అందరిని ఎవరి ఇళ్లకు వాళ్ళని సురక్షితంగా చేరుకునేలా ఏర్పాట్లు చేసారు . ఎంతో అవసరమైనపుడు వెంటనే స్పందించి సహాయాం చేసిన ముఖ్యమంత్రిగారు గ్రేట్ హాట్స్ఆఫ్ అంటున్నారు సదురు అమ్మాయిలు.