కరోనా వల్ల ఇప్పటికే అన్ని రంగాల కి చెందిన కంపెనీలకు అధికంగా నష్టం రావడంతో కొంతమందిని ఉద్యోగాల్లో నుండి తీసేస్తున్నారు. దాంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఒక్క భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. ఇలాంటి కష్టమైన పరిస్థితులలో యునైటెడ్ కింగ్‌డమ్ లో స్థిరపడ్డ కేరళకు చెందిన ఒక జంట కు మాత్రం అదృష్టం వరించింది.

Video Advertisement

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నాటింగ్‌హామ్‌లో నివసించే షిబు పాల్ మరియు లిన్నెట్ జోసెఫ్ కి కారు కొనాలని ఎప్పటినుండో ఉందట.ముందు వీళ్ళిద్దరూ కేంబ్రిడ్జిలో నివసించే వాళ్ళు. కానీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉండడంతో నాటింగ్‌హామ్ కి వచ్చేశారు.

ప్రస్తుతం లిన్నెట్ నాటింగ్‌హామ్ సిటీ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. షిబు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనే లాటరీ కాంటెస్ట్ అప్లికేషన్ నింపారట. అలా మూడు సార్లు అప్లికేషన్ నింపారు. చివరిది ఎయిర్ పోర్ట్ లో నింపారు. ఆ తర్వాత అసలు ఆ కాంటెస్ట్ సంగతే మర్చిపోయారు.

 

కానీ ఆ లాటరీలో షిబు నింపిన అప్లికేషన్ ఎంపికయింది. దాంతో వాళ్ళకి లాటరీలో లాంబోర్గినీ కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. దాన్ని ఆ కంపెనీ యొక్క ప్రతినిధులు వచ్చి షిబు మరియు లిన్నెట్ జంటకు అందించి వెళ్లారు. దాంతో ఆ జంట ఆనందానికి అవధులు లేవు. అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే ఏమో కదా?