డాక్టర్లకే అర్ధం కానిది.. మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది..? ఈ యువతుల కథ ఏంటంటే..?

డాక్టర్లకే అర్ధం కానిది.. మామూలు వాళ్ళకి ఏం తెలుస్తుంది..? ఈ యువతుల కథ ఏంటంటే..?

by kavitha

Ads

కేరళ జంట అఫిఫా, సుమాయా షెరీన్ లు అఫిఫా తల్లిదండ్రుల నుండి ఇద్దరికి ప్రమాదం ఉందని, వారి నుండి బెదిరింపులు వస్తున్నాయని కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు అఫిఫా తల్లిదండ్రులు ఇద్దరినీ బలవంతంగా విడదీయడానికి ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు.

Video Advertisement

కేరళ హైకోర్టు జూలై 5న ఈ కేసు పై విచారణ జరిపి, కేరళ పోలీసు డీజీపీ, పోలీసు కమిషనర్‌కు అఫిఫా, సుమాయాకు  పోలీసు రక్షణ ఇవ్వమని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ జూలై 21న జరుపనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అఫిఫా, సుమాయా కలిసి బ్రతకడానికి ఎదుర్కొన్న సమస్యల గురించి బీబీసీకి వివరించారు. ఆ యువతుల కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Kerala-Lesbian-Coupleబీబీసీ తెలుగు కథనం ప్రకారం, కేరళకు చెందిన అఫిఫా, సుమాయా ఒకే పాఠశాలలో 12వ తరగతి చదివారు. అక్కడే ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. లాక్‌డౌన్ టైమ్ లో లెస్బియన్ జంటల వలె వీరిద్దరు లివి ఇన్ రిలేషన్ షిప్ మొదలుపెట్టారు. ఇద్దరిది ఒకే లాంటి మనస్తత్వం కావడం వల్ల ప్రేమలో పడ్డామని తెలిపారు. వీరి సంబంధం గురించి ముందుగా అఫిఫా ఇంట్లోవారికి  తెలిసింది. 2023 జనవరి 27న ఇద్దరు ఇళ్లు విడిచి వెళ్లారని వారి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. దాంతో ఈ జంట జనవరి 29న మలప్పురం జిల్లా కోర్టులో హాజరయ్యారు.
తాము ఇద్దరం కలిసి ఉండాలనుకుంటున్న  విషయం కోర్టుకు చెప్పడంతో అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కంపెనీలో పనిచేస్తోన్న ఈ జంట అప్పటి నుండి కలిసి జీవించడం మొదలుపెట్టారు. కానీ, అఫిఫా తల్లిదండ్రులు, బంధువులు వారు పని చేసే దగ్గరికి వెళ్ళి అఫిఫాను బలవంతంగా తీసుకెళ్లారు. దాంతో సుమాయా పోలీసు స్టేషన్లలో కంప్లైంట్ చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు వారు తీసుకోలేదు. ఆ తర్వాత కేరళ హైకోర్టులో సుమాయా ఒక పిటిషన్ దాఖలు చేసింది. అఫిఫాను కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించింది.అయితే వారు కోర్టు ఆర్డర్ పాటించకుండా తమకు టైమ్ కావాలని అడిగారు. ఆ తర్వాత జూన్ 10 రోజులకు అఫిఫాను కోర్టుకు ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు బెదిరిచడంతో అఫిఫా కోర్టులో సుమాయాతో కలిసి ఉండాలనుకోవడం లేదని తెలిపారు. అలాగే తన తల్లిదండ్రులతో ఉండాలనుకున్నట్లు అఫిఫా చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అఫిఫా సుమాయాకు ఫోన్ చేసి, కోర్టు ముందు చెప్పిందంతా కావాలని మాట్లాడింది కాదని, తన తల్లిదండ్రులు వైద్య చికిత్స చేయించారని తెలిపింది.
వనజా కలెక్టివ్ సంస్థ ద్వారా సుమాయా పోలీసుల సహాయంతో అఫిఫాను తన తల్లిదండ్రుల నుంచి రక్షించారు. కోర్టులో సుమాయాతో వెళ్లలేనని చెప్పిన పరిస్థితులను అఫిఫా బీబీసీకి వివరించారు. శారీరక సంబంధం కోసం మాత్రమే తాము కలిసి ఉండాలని అనుకుంటున్నామని అనేవారని, ఇలా ఆలోచించే వారితో మాట్లాడటం కూడా అర్థరహితం. తమను అర్థం చేసుకునే విధంగా వారిని మార్చలేం’’ అన్నారు. డాక్టర్లే మా బంధాన్ని అర్థం చేసుకోలేదని, సొసైటీ, తల్లిదండ్రులు ఎలా అర్థం చేసుకుంటారని సుమాయా, అఫిఫా చెప్పుకొచ్చారు.

Also Read: గుండెని కలిచి వేస్తున్న అమానుషం..! ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏం చేశాడంటే..?


End of Article

You may also like