డెలివరీ కోసం భార్యను ఇండియాకి పంపించారు ఆ భర్త…కానీ చివరికి ఏమైందో తెలుస్తే కన్నీళ్లొస్తాయి!

డెలివరీ కోసం భార్యను ఇండియాకి పంపించారు ఆ భర్త…కానీ చివరికి ఏమైందో తెలుస్తే కన్నీళ్లొస్తాయి!

by Sainath Gopi

Ads

కరోనా మహమ్మారిని ప్రపంచాన్ని వణికిస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడ చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘వందే భారత్ మిషన్’ ని ప్రవేశపెట్టింది భారత ప్రభుత్వం. ఆ మిషన్ ద్వారా తన భార్యను దుబాయ్ నుండి ఇండియాకి పంపించారు ఓ భర్త. కానీ ఆ తర్వాత గుండెపోటుతో మరణించారు. కంటతడి పెట్టించే ఈ ఘటనకు సంభందించిన వివరాలలోకి వెళ్తే.

Video Advertisement

 నితిన్ చంద్రన్(28) స్వస్థలం కేరళ. దుబాయ్‌లోని ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అతిరా గీతా శ్రీధరన్(27) . ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. డెలివరీ కోసం భార్యను చంద్రన్ కేరళలోని తన ఇంటికి “వందే భారత్ మిషన్” ద్వారా పంపించారు. దుబాయ్ నుండి మే 7 న గీత ఇండియాకి వచ్చారు. చంద్రన్ మాత్రం విధుల కారణంగా అక్కడే ఉండిపోయారు.

గీతకు జూలైలో డెలివరీ జరగనుంది. కానీ ఇంతలో అనుకోని విషాదం నెలకొంది.గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం.. సోమవారం రాత్రి నిద్రలో ఉండగా చంద్రన్‌కు హై బిపి వల్ల గుండెపోటు వచ్చి నిద్రలోనే మరణించారు. ఆ విషయాన్ని వైద్యులు ధృవీకరించారని చంద్రన్ స్నేహితుడు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న చంద్రన్ కుటుంబసభ్యుల ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. కొద్ది రోజుల్లో తండ్రికాబోతున్నారు అని సంతోషించేలోపే ఇలా జరగడం బాధాకరం.

 


End of Article

You may also like