భారత్ లోనే మొదటగా కేరళలో “కమ్యూనిటీ ట్రాన్స్మిషన్”? అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన 7 చర్యలు ఇవే.!

భారత్ లోనే మొదటగా కేరళలో “కమ్యూనిటీ ట్రాన్స్మిషన్”? అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన 7 చర్యలు ఇవే.!

by Mohana Priya

Ads

భారత దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేస్ మొట్టమొదటిగా రిజిస్టర్ అయిన రాష్ట్రం కేరళ. దాంతో వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంది కేరళ ప్రభుత్వం. దీనిపై కేరళ సిఎం పినరయి విజయన్ గత వారం మాట్లాడుతూ ” కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ చూసిన మొదటి రాష్ట్రం కేరళ. కరోనా వైరస్ మొదటి పాజిటివ్ కేస్ జనవరిలో నమోదు అయింది.

Video Advertisement

రెండవ లాక్ డౌన్ సమయం లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపడానికి మేము ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కేరళ స్వస్థలం అయిన ప్రజలు వందే భారత్ ఫ్లైట్ ల ద్వారా కేరళ కి తిరిగి వచ్చారు. దాంతో కేరళ లో ఉన్న పట్టణ ప్రాంతాలే కాకుండా గ్రామాలలో కూడా ఈ వైరస్ వ్యాపించడం మొదలైంది. అంతేకాకుండా కేరళలోని తీర ప్రాంతం పూంతురా లో కూడా వైరస్ విస్తరిస్తోంది” అని అన్నారు.

కేరళ సీఎం సలహాదారులు ఐఏఎస్ రాజీవ్ సదానందన్ మాట్లాడుతూ ” కేరళ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వాటిలో త్రివేండ్రం, కన్యాకుమారి కూడా ఉన్నాయి. ఎవరి నుండి వ్యాప్తి చెందుతుందో కూడా తెలియకుండా వైరస్ అంతటా పాకుతోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా పెరిగిపోతుండటంతో ప్రభుత్వం అసలు వైరస్ మొదలైన స్థానాన్ని గుర్తించలేకపోయింది. దాంతో ఈ పరిస్థితిని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గా ప్రకటించింది.

ఎవరి నుంచి అయినా వైరస్ అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని ప్రజలకు మేము చెప్పాలి అని అనుకుంటున్నాం. మనుషులు ఎక్కువగా కలవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది అని కేరళ ప్రభుత్వం లాక్ డౌన్ ని పొడిగించింది. ఐసోలేషన్ పాటించినా కూడా 13000 పాజిటివ్ కేసులు 44 మరణాలు చోటుచేసుకున్నాయి. లాక్ డౌన్ పొడిగించడం వల్ల పాజిటివ్ కేసులు తగ్గాయి అంతేకాకుండా వైద్య సేవలను కూడా మెరుగు పరచగలిగాము” అని చెప్పారు.

కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ సమస్యను పరిష్కరించడానికి కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవే.

#1 కేరళ మెడికల్ ఆర్మీకి 8వేల మందిని అదనంగా చేర్చారు.

#2 క్వారంటైన్ లో ఉన్న వాళ్లని పర్యవేక్షించడానికి డ్రోన్స్ ఏర్పాటు చేశారు.

#3 ఫేస్ మాస్క్ వాడడం పై కఠిన నియమాలను విధించారు.

#4 సీల్ వేసిన ప్రాంతాల్లో ఎక్కువ మంది పోలీసులను నియమించారు.

#5  ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలి అని కేరళ ప్రభుత్వం వారు      నిర్ణయించుకున్నారు.

#6 కంటోన్మెంట్ జోన్ లో ఉన్న ప్రదేశాల్లో కి ఎవరు వెళ్లకుండా వార్నింగ్ బోర్డులు పెట్టడం లేదా సెక్యూరిటీ పెంచడం లాంటివి చేస్తున్నారు.

#7 ప్రైవేట్ ఆసుపత్రులలో 20% బెడ్ లను కోవిడ్ పేషెంట్లకు అందించాలి అని కోరారు.

రాజీవ్ సదానందన్ మాట్లాడుతూ ” కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి మేము చేసే చర్యను మూడు భాగాలుగా విభజించాం. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ద్వారా కరోనా సోకిన వారిని తీసుకుంటాం వాళ్ల వల్ల ఏ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందో కనుక్కుంటాం. ఆ ప్రదేశాల్లో భద్రతను పెంచి మిగిలిన వాళ్ళకి వ్యాప్తి చెందకుండా ఆపుతాం.

రెండవది ఏంటి అంటే పాజిటివ్ వచ్చిన వాళ్లకి అన్ని రకాల టెస్టులు చేయించి వారితో పాటు ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారో తెలుసుకొని, పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ క్వారంటైన్ లో ఉండమని సూచిస్తాం. మూడవది ఏంటంటే పాజిటివ్ వచ్చిన వాళ్లందరికీ ఉత్తమమైన చికిత్స అందిస్తాం. అంతేకాకుండా వృద్ధులకి, అనారోగ్యంతో ఉన్న వాళ్లకి అదనంగా జాగ్రత్తలు తీసుకొని తరచుగా పరీక్షలు చేయిస్తాం” అని అన్నారు.


End of Article

You may also like