Ads
కరోనా ఉపద్రవం అందరినీ మింగేయాలని కోరలు చాస్తుంటే ఆ కోరలను పీకి పడేయడానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న డాక్టర్ లకు,వైద్య సిబ్బంది సేవలకు యావత్ ప్రపంచం సలాం చేస్తుంది.ఇలాంటి టైంలో అమెరికా లోని సౌత్ ఫ్లోరిడాలో ఓ మలయాళీ నర్స్ పై జరిగిన దారుణం అందరి మనసులను కలచి వేసింది.
Video Advertisement
వివరాలలోకి వెళ్తే మేరిన్ అనే కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన నర్స్ మేరిన్ జాయ్ సౌత్ ఫ్లోరిడా రాష్ట్రంలోని కోరల్ స్ప్రింగ్స్ సిటీలో బ్రోవార్డ్ హెల్త్ కోరల్ స్ప్రింగ్ హాస్పిటల్లో నర్స్ గా పని చేస్తుంది.తన నోటీస్ పీరియడ్ లో ఆఖరి రోజున నర్స్ గా తన బాధ్యతను పూర్తి చేసుకొని బయటకు వచ్చిన మేరిన్ ను తన భర్త ఫిలిప్ మాథ్యూ అలియాస్ నేవిన్ తన భార్యను అతి క్రూరంగా అనేకసార్లు కత్తితో పొడిచి తన కారు ను ఆమె మీదుగా పోనిచ్చాడు.దీనితో మేరిన్ అక్కడి అక్కడే మృతి చెందింది.
రంగలోకి దిగిన పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇంట్లో గొడవలు కారణంగా భార్య ,భర్త ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు.తన పై ఉన్న పాత పగతోనే ఫిలిప్ మాథ్యూ ఇలా చేశాడని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.దానితో అతనిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ గా కేసు నమోదు చేశారు.ప్రస్తుతానికి ఇతను యుఎస్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
End of Article