కేరళ సరికొత్త ఆలోచన… గొడుగుతో కరోనా కు చెక్! ఎలాగంటే?

కేరళ సరికొత్త ఆలోచన… గొడుగుతో కరోనా కు చెక్! ఎలాగంటే?

by Megha Varna

Ads

ఈ కరోనా వైరస్ ను అదుపు చెయ్యడానికి ఉన్న ఏకైక మార్గం సామజిక దూరం అంటూ ప్రభుత్వాలు ,నిపుణులు చెపుతున్నారు. ఈ మేరకు సోషల్ డిస్టెన్స్ పాటించడంకోసం కేరళ ఒక సరికొత్త ఆలోచనతో ముందుకి వచ్చింది. ప్రతి ఒక్కరు గొడుగులు ఉపయోగించాలంటూ సూచించింది . గొడుగు ఉపయోగించడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా?

Video Advertisement

ప్రజలు నిత్యావసరాల కోసం మార్కెట్ కి వెళ్ళినప్పుడు చాలామంది గుంపులుగా ఉంటారు. దాని వల్ల ఎంతో పేరంటం ఉంది.అది అరకట్టడంకోసం ఓ నూతన ఆలోచనతో ముందుకి వచ్చింది కేరళ .ప్రజలు బయటకు వచ్చినప్పుడు మాస్క్ తో పాటు గొడుగు ఉపయోగించడం కూడా తప్పనిసరి అని ఆంక్షలు విధించింది .కేరళ లోని అలపుళా దగ్గరలోని తన్నీరు ముక్కమ్ గ్రామ పంచాయతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .ఈ గొడుగు ఉపయోగించడం వల్ల భౌతిక దూరం పాటించచ్చు. అంతేగాక ఎండ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 


End of Article

You may also like