పది రోజుల క్రితం చేసిన సహాయం…ఆమె జీవితాన్నే మార్చేసింది.! హ్యాట్సాఫ్ సుప్రియ..!

పది రోజుల క్రితం చేసిన సహాయం…ఆమె జీవితాన్నే మార్చేసింది.! హ్యాట్సాఫ్ సుప్రియ..!

by Megha Varna

Ads

మనం చేసే మంచి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఇది ఒట్టి సామెత అని మీరు కొట్టిపారేస్తారా? అయితే ఈ సంఘటన చూడండి తప్పకుండా మీ అభిప్రాయం మారుతుంది.కేరళలోని తిరుపత్తూర్ జిల్లా పరిధిలో ఉండే తిరువల్లులో నివసిస్తున్న సుప్రియ అనే మహిళ స్థానికంగా జోయ్ ఆలుక్కాస్ సంస్థలో పని చేస్తుంది.

Video Advertisement

10 రోజుల క్రితం సుప్రియ ఓ అంధుడిని బస్సు ఎక్కించేందుకు బస్సు వెనకాలే పరిగెత్తి ఆ బస్సును ఆపి అతడిని బస్సు ఎక్కించి పంపింది.ఇదంతా అక్కడే ఉన్న సిసిటివి కెమెరా లో రికార్డ్ అయ్యింది.తాజాగా ఆ వీడియోను తిరుపత్తూరు జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.ఆ వీడియో ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయ్యింది.

దాన్ని చూసిన జోయ్ ఆలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ ఆమెను అభినందించేందుకు వచ్చేవారం త్రిస్సూర్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.ఆయన ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళిన సుప్రియకు ఆయన ఓ ఇల్లు బహుమానంగా ఇచ్చారు.చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న సుప్రియ జోయ్ ఆలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ బహుమానం చూసి ఆశ్చర్యపోయింది.అలాంటి బహుమతిని ఇచ్చిన ఆమె బాస్ కు కృజ్ఞతలు తెలిపింది.

 


End of Article

You may also like