Ads
ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.
Video Advertisement
అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు.
సినిమా క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఇందులో అందరూ ఊహించినట్టుగానే ఎలివేషన్స్ హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా డైలాగ్స్ అయితే సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఈ సినిమాలో వైలెన్స్ డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయ్యింది.
దీనికి పేరడీగా ఇటీవల ఒక వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ లో ఇదే విధంగా ఒక డైలాగ్ రాసారు. వైలెన్స్ అన్న పదం తీసేసి మ్యారేజ్ అని అర్థం వచ్చేలాగా ఇన్విటేషన్ లో రాశారు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంక సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా సూపర్‌హిట్ అయింది. చాలా మందికి మొదటి భాగం కంటే ఇదే బాగా నచ్చింది. దాంతో సినిమాలో నటించిన వారందరికీ కూడా ఇంకా గుర్తింపు వచ్చింది.
End of Article