ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజిఎఫ్ మానియా కొనసాగుతోంది. సినిమా రిలీజ్ తోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మూవీతో భాషతో సంబంధం లేకుండా హీరో యష్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.

Video Advertisement

ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి యష్ ఇంతటి స్థాయికి చేరుకొని పేరు సంపాదించడం కోసం ఆయన పడ్డ కష్టాలు చెప్పుకుంటే తీరవు.

 

ఈ మూవీ ఇప్పటికే 100 కోట్లు దాటి ఇంకా కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇంతటి విజయం యష్ ఖాతాలో పడగా, ప్రశాంత్ నీల్ ఖాతాలో మాత్రం ఆయన ఊహించని రికార్డులు చేరుతున్నాయి. కేజిఎఫ్ 2 విజయవంతం అయిన తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకుని మళ్లీ కొత్త సినిమాలకు సంబంధించిన డేట్స్ ను ప్రకటిస్తారట. ఆయన షూటింగ్లతో ఎంత బిజీగా ఉన్నా సరే తన కుటుంబం కోసం మాత్రం కొంత సమయాన్ని కేటాయిస్తారని మనందరికీ తెలిసిందే.

అయితే యష్ కు ఒక చిన్న కూతురు ఉంది ఆమె పేరు ఐరా కాగా. అయితే ఆయన సోషల్ మీడియాలో తన కూతురు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. సలాం రాఖీ బాయ్ అంటూ తన ముద్దు ముద్దు మాటలతో క్యూట్ గా పాడిన పాటను యష్ షేర్ చేశాడు. దీంతో ఈ పాట కాస్త వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల వ్యూస్ వచ్చాయి యష్ కూతురు టాలెంట్ కు చాలామంది ఫీదా అవుతున్నారు.

watch video :