KGF హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ఈ విషయాలు తెలుసా.?

KGF హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ఈ విషయాలు తెలుసా.?

by Sunku Sravan

Ads

ప్రస్తుతం కే జి ఎఫ్ సినిమా దునియా నడుస్తోంది. ఎక్కడ చూసినా మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే కే జి ఎఫ్ మూవీ గురించి, అందులోని నటీనటుల గురించి ఎన్నో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో అందులో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి, కే జి ఎఫ్, కే జి ఎఫ్ 2లో హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. ఆమెకు అనేక సినిమా ఆఫర్లు వస్తున్నా విక్రమ్ కు జోడీగా తెరకెక్కుతున్న మూవీ కోబ్రా, మినహా ఇంకా ఏ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అని చెప్పవచ్చు.

Video Advertisement

కే జి ఎఫ్ లో ఈమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. రీనా అనే పాత్రలో ఆమె నటించడమే కాదు జీవించే సారు. కే జి ఎఫ్ 2 మూవీ సక్సెస్ తర్వాత ఆమెకు అనేక ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఆమె మాత్రం టాలీవుడ్ లోని స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ దక్కాలని కోరుకుంటున్నట్లు తెలుస్తున్నది. అలాగే శ్రీనిధి శెట్టి మిస్ దివా సూపర్ నేషనల్ విన్నర్ కూడా కావడం విశేషం.. కే జి ఎఫ్ టు లో అమ్మ గురించి శ్రీనిధి చెప్పే డైలాగ్స్ అభిమానులను ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. 2016 లో జరిగిన మిస్ దివా సూపర్ నేషనల్ పోటీల్లో రీనా విజేతగా నిలవడంతో ఈ ఘనత సాధించిన రెండో భారతీయురాలిగా ఆమె రికార్డులకేక్కరు.

కే జి ఎఫ్ చాప్టర్ వన్ మూవీకి సైమా ఈవెంట్ లో శెట్టి కి ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది. కోబ్రా మూవీ కూడా సక్సెస్ సాధిస్తే ఇక ఆమెకు తిరుగుండదని అవకాశాలు మరింత పెరిగే చాన్స్ ఉందని అంటున్నారు. అయితే శ్రీనిధి శెట్టి కి కే జి ఎఫ్, కే జి ఎఫ్ 2 మూవీస్ కు చాలా పారితోషికం అందిందని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి శ్రీనిధి శెట్టి దాదాపుగా మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ దక్కిందని సమాచారం. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.


End of Article

You may also like