హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరగనున్నాయి? ఖైరతాబాద్ వినాయకుడి మార్పులు ఇవే।!

హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరగనున్నాయి? ఖైరతాబాద్ వినాయకుడి మార్పులు ఇవే।!

by Mohana Priya

Ads

వినాయక చవితి వచ్చిందంటే సిటీ మొత్తం ఎంతో సందడిగా ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ లో. కానీ ఈ సారి అది కుదరక పోవచ్చు. ప్రస్తుతం రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్న పరిస్థితుల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించే విధానంపై ప్రభుత్వం కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంది.

Video Advertisement

 

ప్రతి ఏడాది లాగా ఈసారి ఖైరతాబాద్ వినాయకుడిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వడం లేదు. కార్యక్రమాలు అన్నీ కూడా భౌతిక దూరం పాటిస్తూనే జరుగుతాయి. వినాయకుడి మట్టి విగ్రహం ఇరవై ఏడు అడుగులు ఉండబోతోంది. ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడు ధన్వంతరి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు.

గత 65 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ లో వినాయకుడి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎంతో మంది ప్రజలు వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారు. అదే విధంగా ఈసారి కూడా ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి. కాని ప్రత్యక్షంగా వెళ్లి దర్శించుకునే సదుపాయాన్ని ఈసారి ఏర్పాటు చేయడం లేదు.

ప్రత్యక్షంగా దర్శించుకునే వీలు లేక పోయినా కూడా ఆన్లైన్ స్ట్రీమింగ్ లో వినాయకుడిని దర్శించుకునే అవకాశం కల్పించబోతున్నారు. గత ఏడాది వినాయకుడి చేతిలో ఉన్న లడ్డు ఆరు వేల కిలోలు ఉంది. ఈసారి విగ్రహం పరిమాణం తగ్గడంతో లడ్డూ పరిమాణం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ప్రతి ఏడాది భారీ ఊరేగింపుతో విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. కానీ ఈ సారి అలా చేయడం లేదు అని, విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటే అభిషేకించి అక్కడే నిమజ్జనం చేయాలని అనుకుంటున్నట్లు కమిటీ సభ్యులు
సుదర్శన్ చెప్పారు.

ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఎత్తు ఒక్కొక్క అడుగు పెరుగుతూ వస్తుంది. పోయిన సంవత్సరం 66 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు.నుండి ప్రతి ఏడాది విగ్రహం ఎత్తు ఒక్క అడుగు తగ్గిస్తారు అని ఉత్సవాలు నిర్వహించే కమిటీ గత సంవత్సరం పేర్కొంది. అలా ఈ సంవత్సరం 65 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉంది.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా 27 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.మిగిలిన చోట్ల ప్రతి ఏడాదిలాగే వినాయకుడు నిర్వహించవచ్చా? లేదా? ఒకవేళ నిర్వహించిన కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


End of Article

You may also like