ఇందిరమ్మ ఇంట్లో ఉండే పేపర్ బాయ్…ఇప్పుడు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే.! ఎవరంటే.?

ఇందిరమ్మ ఇంట్లో ఉండే పేపర్ బాయ్…ఇప్పుడు కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే.! ఎవరంటే.?

by Mounika Singaluri

Ads

ప్రస్తుతం రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలంటే రాజకీయ వారసత్వం ఉండాలి. లేదంటే కుప్పల తెప్పలుగా డబ్బు ఉండాలి. ఇంకా వేరే దారి ఏదైనా ఉందంటే దానికి మించి పలుకుబడి ఉండాలి. ఇవేమీ లేకుండా ఎమ్మెల్యే అవ్వడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న దగ్గర నుండి ఎన్నికలు అయ్యేంతవరకు విపరీతంగా ఖర్చు చేయాలి.

Video Advertisement

అడిగిన వాడికి అడిగినంత ఇవ్వాలి, ఓట్లకు డబ్బు పంచాలి ప్రచారానికి డబ్బు ఖర్చు పెట్టాలి, కూడా తిరిగేవారికి డబ్బు ఇవ్వాలి, ఇలా రాజకీయాల్లో ఉండే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు అనూహ్యంగా తొలిసారి అవకాశం దక్కించుకుని విజయాన్నీ సాధించారు. వీరిలో కొందరు రాజకీయాల్లో ఉద్దండులనూ మట్టికరిపించి సంచలనం సృష్టించారు. ఇక ఈ ఎన్నికల్లో సామాన్యులు కూడా సత్తా చాటారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకున్నా.. ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు

అయితే రాజకీయాల్లో సామాన్యులు రాణించడం కష్టమనే అభిప్రాయం నిజం కాదని నిరూపించాడు ఆదివాసీ గోండు బిడ్డ వెడ్మ బొజ్జు. ఇప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లోనే నివాసముంటున్న బొజ్జు నేడు ఆ పార్టీ ఇచ్చిన టికెట్‌పై పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వెడ్మా బొజ్జు పటేల్‌ అనూహ్యంగా గెలుపొందారు. భాజపా నుంచి మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, బీఆర్ఎస్ నుంచి ఎన్నారై, కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్‌లతో పోటీపడినా ఓటర్లు మాత్రం బొజ్జుకే పట్టంకట్టారు. ఆదివాసీ గోండు బిడ్డ అయిన వెడ్మ బొజ్జుది సామాన్య నేపథ్యం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరు మండలం కల్లూర్‌గూడకు చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిల కుమారుడు వెడ్మబొజ్జు పటేల్‌. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లో నివాసముంటున్నారు.

పీజీ వరకు చదివిన బొజ్జు తొలుత ఆదివాసీ విద్యార్థి సంఘంలో,తర్వాత ఆదివాసీ హక్కుల పోరాట సమితిలో సలహాదారుడిగా, అనంతరం కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరి అధిష్టానం ఆశీస్సులతో టిక్కెట్ దక్కించుకున్నారు.తనకు రూ.8.42 లక్షలు అప్పులున్నాయని, ఉమ్మడి ఏపీలో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన ఇంట్లోనే నివాసం ఉంటున్నట్లు నామినేషన్ లో పేర్కొన్నారు. బొజ్జు చదువుకునే సమయంలో పేపర్ బాయ్‌గాను పని చేశారు.ఖానాపూర్‌ నియోజకవర్గం ఏర్పడ్డాక గోండు సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి కోట్నాక్‌ భీంరావు ఒక్కరే ఇక్కడ విజయం సాధించారు. మూడు దశాబ్దాల తర్వాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా బొజ్జు రికార్డు సృష్టించారు.

మూడు దశాబ్దాల తర్వాత ఆ ఘనత సాధించిన రెండో వ్యక్తి..హ్యాట్సాఫ్.! 🙏🙏


End of Article

You may also like