వయసు మీద పడుతున్న కొద్దీ మన నటీమనులు ఒళ్లు చేయడం సహజం… కానీ చక్కనమ్మ చిక్కినా అందమే, బొద్దుగా ఉన్నా అందమే అనేది కొందరి హీరోయిన్లకు వర్తిస్తుంది.. తాజాగా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్న కొన్ని ఫోటోలు ఎవరీ బ్యూటీ అని కాసేపు స్టన్నయ్యేలా చేస్తుంటే..తీరా అది ఒకనాటి తార కుష్బూ అని తెలిసి.. వావ్ .. ఈమె ఆమేనా అంటూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి..

జన్మత: ఉత్తరాది అయినప్పటికి , బాలివుడ్ లో కెరీర్ ప్రారంభించినప్పటికి సౌత్ లోనే అగ్రతారగా వెలుగొందారు ఖుష్బూ.. “కలియుగ పాండవులు” చిత్రంలో వెంకటేష్ సరసన నటించి తెలుగు తెరకు పరిచయం అయిన నటి కుష్బూ..తర్వాత తమిళం వైపు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.. అడపదడపా దక్షిణాది భాషలన్నింటిలోను నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.. తెలుగులో ఎక్కువగా వెంకటేష్, నాగార్జునల సరసన నటించింది ఖుష్బూ.ఆ  తర్వాత రాజకీయాలు, సినిమాలు , సీరియళ్లు అంటూ అన్ని రంగాల్లో తన ప్రాధాన్యత చాటుకొన్నారు..

అప్పట్లో సన్నగా నాజూగ్గా ఉన్న ఖుష్బూ  తర్వాతర్వాత లావు అయిన సంగతి తెలిసిందే..తమిళ దర్శకుడు సుందర్ ని వివాహం చేసుకుని ,ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత మరింత ఒళ్లు చేసింది. అయితే లాక్ డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకుని తన బాడీఫిట్నెస్ పై కాన్సన్ట్రేట్ చేసింది.లాక్డౌన్‌ అమల్లోకి రావడంతో సినీ పరిశ్రమ స్తంభించిపోయింది . సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరూ ఇంటిపట్టునే ఉంటున్నారు..బోలెడంత తీరిక సమయం దొరికింది..ఈ సమయాన్ని వృదా కానివ్వకుండా తన భారీకాయంపై దృష్టి పెట్టి.. రకరకాల వ్యాయామాలు చేసి మూడు నెలల్లో  ఏకంగా 15కిలోల బరువు తగ్గి, సన్నగా , స్లిమ్ గా అయింది.

తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఖుష్బూ.. సోషల్ మీడియాలో వైరలయిన ఈ ఫోటోలను చూసిన సినిమాభిమానులు ఎవరీ భామ అంటూ రెప్పపాటు ఆలోచించి, ఖుష్బూ అని తెలియగానే ఆశ్చర్యపోతున్నారు..మళ్లీ తొలినాళ్లల్లో ఖుష్బూల ఉన్న  తనని చూసి మళ్లీ హీరోయిన్ గా నటిస్తుందా అనే విధంగా తయారయ్యారు..

ఇదిలా ఉండగా  రజనీకాంత్‌కు జంటగా నటిస్తున్న అన్నాత్త చిత్రం కోసమే ఖుష్బూ బరువు తగ్గి చాలా స్లిమ్గా తయారైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..మరోవైపు కుష్బూ కూతురు కూడా వర్క్‌ ఔట్‌ చేసి స్లిమ్‌గా తయారయింది. దీంతో కుష్బూ తన కూతురుకు పోటీగా తయారైందా అనే కామెంట్స్ చేస్తున్నారు కొందరు..ఏదైతేనేమి మూడు నెలలో 15కిలోలు తగ్గి మునుపటి ఖుష్బూలా తయారవడంతో ఆమె అభిమానులు ఆనందంగా ఫీలవుతున్నారు..ఖుష్బూ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా..తన కోసం ఏకంగా గుడినే కట్టించిన అభిమానులున్నారు ఖుష్బూకి… ఆ గుడిని తర్వాత నేలమట్టం చేశారు అది వేరే విషయం..


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com