టాలీవుడ్ అందాల నటి శ్రీదేవి మృతి చెందిన విషయం తెలిసిందే.కాగా బోనికపూర్ శ్రీదేవి కూతురులు జాహ్నవి మరియు ఖుషి.ఖుషి తాజాగా తనను జీవితంలో బాధకు గురిచేసిన పలు అంశాలను ఒక వీడియో రూపంలో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.క్వారంటైన్ టేప్స్ పేరుతో వీడియో ను రిలీజ్ చెయ్యడం విశేషం.సదురు వీడియోలో ఖుషి తాను 19 ఏళ్ళ అమ్మాయిని అని చెపుతూ

Video Advertisement

జీవితంలో నేను ఎలా బతకాలనుకుంటున్నానో అలా లేను దానికోసం నేను ఇంకా కృషి చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నారు .నేను ఎలా ఉన్న కూడా నన్ను చాలామంది అభినందిస్తూ ఉంటారు.అలాంటివారి కోసం నేను ఏమైనా సాదించాలి అనుకుంటున్నాను .మీ అమ్మగారైన శ్రీదేవి ,మీ అక్క ఐన జాహ్నవి లాగ నువ్వు అందంగా లేవని చాలామంది నన్ను అపహాస్యం చేసారు .ఆ సమయంలో నా మనసుకు చాలా బాధ అనిపించేది.నాకు స్వతహాగా సిగ్గు మరియు ఇంఫియారిటీ కాంప్లెక్స్ ఎక్కువని దానివలన జీవితంలో చాలాసార్లు ఇబ్బందికి గురయ్యానని ఖుషి తెలిపారు

దీనివలన ఆహారం తినే విధానం నుండి వస్త్రధారణ వరకు అన్నిట్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చుకున్నని ఖుషి అన్నారు.అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎలా ఉన్న కూడా మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యం అని నేను ప్రస్తుతం అదే చేస్తున్నాని ఖుషి తెలిపారు .పక్కవాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా అభిప్రాయపడతారా అని మాత్రం ఆలోచించకుండా మనకి నచ్చినట్లు మనం ముందుకు పోవడమే జీవితం అంటూ వీడియోను ముగించారు .