Ads
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఒక ఘటన చర్చలకి దారి తీసింది. వివరాల్లోకి వెళితే, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం 18 సంవత్సరాల ఖుషి అనే ఒక అమ్మాయి 22 సంవత్సరాల ఢిల్లీకి చెందిన సుమిత్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. వారిద్దరిదీ ప్రేమ వివాహం. ఖుషి వాళ్ళ తల్లిదండ్రులు తనని వేరే పెళ్లి చేసుకోమని అనడంతో ఖుషి ఇంకా సుమిత్ కలిసి మార్చి 17వ తేదీన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు.
Video Advertisement
కరోనా కారణంగా సుమిత్ తన ఉద్యోగాన్ని కోల్పోయారు. వారిద్దరూ సాకేత్ కోర్టులో పెళ్లి చేసుకున్న తర్వాత భద్రత కోసం వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారుతూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ జంట ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ప్రైమ్ మినిస్టర్ ని, ప్రెసిడెంట్ ని వారికి భద్రత కల్పించమని అడిగారు.
సుమిత్ మాట్లాడుతూ “తనకి, తన కుటుంబానికి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని, అలాగే వారిని ఆ ప్రాంతం నుండి పంపించేస్తామని, వారిని బతకనీయము అని చెప్పారు” అని పేర్కొన్నారు. ఖుషి తల్లి బానీసా, సోదరి అమ్రీన్ మాట్లాడుతూ వారికి ఖుషి సుమిత్ గురించి తెలియదు అని చెప్పారు.
image courtesy : The Print
ఖుషి తల్లి మాట్లాడుతూ “ఖుషి తను పెళ్ళి చేసుకునే అబ్బాయి గురించి మాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. నా కొడుకు అలాగే అమ్రీన్ కి కాబోయే భర్త ఏ కారణం లేకుండానే ఈ విషయంలోకి లాగబడ్డారు. పోలీసులు వారిద్దరిని విడుదల చెయ్యాలి అని మేము అడుగుతున్నాం. మాకు మా కూతురు వద్దు. తను తన కుటుంబం గురించి పట్టించుకోలేదు. ఒకవేళ తనకి ఇష్టం లేకుండా మేము ఎంగేజ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తను ఎందుకు ఆ పెళ్లి కి వ్యతిరేకంగా ఒక మాట కూడా చెప్పలేదు.
image courtesy : The Print
తను, తన భర్త ఇప్పుడు కెమెరాల ముందు అబద్ధం చెబుతున్నారు” అని అన్నారు. సౌత్ ఈస్ట్ డిసిపి, ఆర్ పి మీనా మాట్లాడుతూ వారు ఉండే ప్రాంతంలో సెక్యూరిటీ పెంచామని చెప్పారు. అలాగే ఆ ప్రాంతంలో కూరగాయలు విక్రయించే షబానా అనే ఒక యువతి పై శనివారం రాత్రి ఆ యువతి (ఖుషి) యొక్క కుటుంబాన్ని ఇంకా అక్కడి స్థానికులను ప్రేరేపించినట్లు ఆరోపణలు వచ్చాయి.
End of Article