కిక్ శ్యామ్ అరెస్ట్ కేసు…ఆ 10 లక్షల వల్ల గొడవ.? రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు?

కిక్ శ్యామ్ అరెస్ట్ కేసు…ఆ 10 లక్షల వల్ల గొడవ.? రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు?

by Megha Varna

Ads

తాజాగా సినీ నటుడు కిక్ ఫేమ్ శ్యామ్ తన అపార్ట్‌మెంట్ లో అనుమతులు లేకుండా గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నందుకు సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్ పై దాడి చేసి అక్కడున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.

Video Advertisement

పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ వ్యాపార వేత్తలు మరియు తమిళ ఇండస్ట్రీకి చెందిన నటులు, టెక్నీషియన్స్ ఉన్నారు. వీరందరినీ చెన్నైలోని నుంగంబాకం F3 పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒక నటుడు గ్యాంబ్లింగ్ లో తన వద్ద ఉన్న పది లక్షలు పోగొట్టుకున్నాడు. దానితో ఆ విషయంపై అక్కడున్న వారితో అతను గొడవ పడ్డాడు. ఇక అతడి మూలానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.దానితో వెంటనే పోలీసులు దాడి చేసి ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ గ్యాంబ్లింగ్ వ్యవహారం రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు జరుగుతుందని పోలీసులు గుర్తించారు.

కిక్ చిత్రంలో మనందరినీ విలన్ గా ఎంటర్ టైన్ చేసిన శ్యామ్ తెలుగులో ఎక్కువగా సురేందర్రెడ్డి చిత్రాల్లో కనిపిస్తారు.శ్యామ్ తెలుగు లో కనిపించిన చివరి చిత్రం రేసుగుర్రం. ఇందులో ఈయన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అన్నగా నటించాడు.శ్యామ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన పార్టీ చిత్రం విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.


End of Article

You may also like