Ads
ఆన్ లైన్ క్లాస్ లు వినడం కోసం మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా?అయితే తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం స్కూల్స్ మరియు కాలేజెస్ మూతపడడంతో పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు.దానితో వారి కోసం ప్రత్యేకంగా విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.ఈ క్లాసులు కోసం తల్లిదండ్రులు తమ బ్యాంక్ సమాచారం నిక్షిప్తమై ఉన్న తమ ఫోన్ లను తమ పిల్లలకు ఇస్తున్నారు.
Video Advertisement
క్లాసులు పిల్లలు వినడం కోసం తల్లిదండ్రులు ఇంట్లో వారికి ప్రత్యేక గదులను కేటాయిస్తున్నారు.దీనితో పిల్లలు క్లాసులు పూర్తవ్వగానే సరదా కోసం గేమ్స్ ఆడటం మొదలు పెడుతున్నారు.ఆతర్వాత ఆ సరదా వ్యసనంగా మారి తల్లిదండ్రుల జేబులకు చిల్లులు వేస్తున్నాయి.గతంలో పంజాబ్ రాష్ట్రంలో ఇద్దరు టీనేజర్స్ సరదాగా ఆడటం కోసం మొదలుపెట్టిన పబ్ జీ గమే ద్వారా దాదాపు 20 లక్షలు వరకు గేమ్ ఇన్ స్టోర్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేశారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 9వ తరగతి చదువుతున్న యువకుడు ఫ్రీ ఫైర్ పెయిడ్ వెర్షన్ గేమ్ ఆడుతూ తన తండ్రి విదేశాల నుండి తన తల్లి ఖాతాకు పంపిన 5.40 లక్షలు ఖాళీ చేసేసాడు.దానికి సంబంధించిన మెసేజ్ లు చూసిన తల్లి కొడుకు నుండి విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
End of Article