మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చు

మీ కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చు

by Megha Varna

Ads

ప్రస్తుత పరిస్థితుల్లో ‘కిడ్నీ స్టోన్స్‌’ అనేది చాలా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కొందరి కిడ్నీల్లో తరుచూ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. శస్త్రచికిత్స ద్వారా వీటిని తొలగించినా ఇవి మళ్లీ ఏర్పడుతుంటాయి.మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. రక్తంలోని మలినాలను శుద్ది చేయడానికి వాటిని బహిర్గతం చేయడం ద్వారా మొత్తం శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి మూత్రపిండాలు. ఇటీవల కిడ్నీల్లో రాళ్ల సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి.ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న శారీరక రుగ్మతల్లో ఇది ఒకటిగామారింది.మూత్రాశయం, కిడ్నీల్లో ఏర్పడే రాళ్ల వల్ల విపరీతమైన నొప్పి కలగడం ఇందులోని ప్రధాన లక్షణం.

Video Advertisement

kidney stone symptoms

kidney stone symptoms

మూత్రం పోసే సమయంలో నొప్పి, మంట, వికారం, జ్వరం, పొట్ట కింది భాగంలో నొప్పి, మూత్రం రంగు మారడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం, తక్కువ మొత్తంలో మూత్రం విసర్జించడం,మూత్రంలో దుర్వాసన వస్తుండడం వంటివి కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో కనిపించే సాధారణ లక్షణాలు. కిడ్నీ స్టోన్స్ వల్ల శరీరం సూచించే హెచ్చరికలను కొంత మంది పెడచెవి పెట్టి తమ ఆరోగ్యాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తుంటారు కూడా. అయితే కింద ఇచ్చిన సందర్భాల్లో కిడ్నీస్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవేమిటో చూద్దాం.

kidney stone symptoms

kidney stone symptoms

1. కాల్షియం ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినే వారి కంటే తక్కువగా తినే వారికే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాళ్లు ఏర్పడేందుకు కారణమయ్యే ఆక్జలేట్స్‌ను మూత్రాశయంలోకి రానివ్వకుండా కాల్షియం అడ్డుకుంటుంది. ఇందుకోసం అది వివిధ రకాల రసాయనాలతో మిళితమై పనిచేస్తుంది.

2. కిడ్నీ స్టోన్స్ తొలి దశలో పొట్ట కింది భాగంలో లేదా వెన్నులో నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి ఒక్కోసారి తక్కువగా, ఒక్కో సందర్భంలో ఎక్కువగా ఉండొచ్చు. ఒకవేళ నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి.

3. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారి మూత్రం రంగు కూడా మారుతుంది. ఎందుకంటే ఆ రాళ్లు మూత్రశాయంలో అటు ఇటు కదులుతూ ఉండడం వల్ల దాంతో ఉండే మూత్రం రంగు మారి అలాగే బయటికి వస్తుంది. ఇది ఘాటైన దుర్వాసనను కలిగి ఉంటుంది.

ఈ టిప్స్ పాటిస్తే కిడ్నీల్లోని రాళ్లు తప్పకుండా కరిగిపోతాయి..

4. మూత్రాశయంలోకి రాళ్లు వస్తే అవి సదరు అవయవాన్ని వాపులకు గురి చేస్తాయి. ఇది ఎంతగానో ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు దీని వల్ల తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్లినప్పుడల్లా నొప్పి కూడా ఉంటుంది. అయితే తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం వెనుక మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, లైంగిక వ్యాధుల వంటి ప్రమేయం కూడా ఉంటుంది.

5. మూత్రాశయంలో కిడ్నీ స్టోన్స్ ఆగిపోతే వారికి ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అలసట, వణుకుతో కూడిన జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సార్లు వికారంగా కూడా అనిపిస్తుంది.

6. కిడ్నీస్టోన్స్ ఉంటే ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా వస్తుంది. అయితే ఇది ఎరుపు రంగులో కాక ఎరుపు, పసుపు మిక్స్ చేసిన డార్క్ రంగులో కనిపిస్తుంది.

 YouTube Signs of Kidney Stones


YouTube
Signs of Kidney Stones

7. కుటుంబంలో, వారి రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కిడ్నీ స్టోన్లు ఉంటే వారి నుంచి వారి పిల్లలకు కూడా అవి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.

8. ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ (ఐబీడీ), క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ స్టోన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరిలో డయేరియా ఉన్నవారు కూడా ఉంటే అది డీహైడ్రేషన్‌కు దారి తీసి కిడ్నీ స్టోన్లు ఏర్పడేలా చేస్తుంది.

9. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తరచూ వస్తున్నా కూడా కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. ఇలా గనక జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించి అందుకు అనుగుణంగా పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభించాలి.

10. విరేచనకారులు (లాక్సేటివ్స్)ను ఎక్కువగా వాడడం వల్ల కూడా కిడ్నీస్టోన్లు ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆ లాక్సేటివ్స్ శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కలగజేస్తాయి. తద్వారా శరీరం పోషకాలను తక్కువగా గ్రహిస్తుంది. డీహైడ్రేషన్ కూడా కలుగుతుంది. ఇది కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు కారణమవుతుంది.


End of Article

You may also like