Ads
- చిత్రం : మీటర్
- నటీనటులు : కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణ మురళి.
- నిర్మాత : చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
- దర్శకత్వం : రమేష్ కడూరి
- సంగీతం : సాయి కార్తీక్
- విడుదల తేదీ : ఏప్రిల్ 7, 2023
Video Advertisement
స్టోరీ :
సినిమా 2006లో రాజమండ్రిలో మొదలవుతుంది. అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ అయిన అర్జున్ తండ్రి కొన్ని కారణాల వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. దాంతో తన కొడుకు కూడా పోలీస్ అవ్వాలి అని, అందులోనూ ఒక మంచి స్థాయిలో ఉండాలి అని అనుకుంటాడు. కానీ అర్జున్ కళ్యాణ్ కి మాత్రం పోలీస్ అవ్వాలి అనే ఆసక్తి ఉండదు. అలాగే ఎగ్జామ్స్ రాస్తాడు. కానీ అనుకోకుండా పోలీస్ సెలక్షన్ పరీక్షల్లో పాస్ అయిపోతాడు.
అయితే అక్కడ చేరిన తర్వాత కూడా అర్జున్ కళ్యాణ్ ఎలా డిస్మిస్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ కంఠం బైరెడ్డి (పవన్) అనే ఒక హోమ్ మినిస్టర్ తో అర్జున్ కళ్యాణ్ కి గొడవ అవుతుంది. అసలు బైరెడ్డి ఏం చేశాడు? అర్జున్ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? వీటి నుండి అర్జున్ ఎలా బయటికి వచ్చాడు? ఆ తర్వాత అక్కడ ఉన్న సమస్యలని అర్జున్ ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
గత కొద్ది సంవత్సరాల నుండి వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకి వస్తున్నారు కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పుడు మీటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. ఇలాంటి కమర్షియల్ టెంప్లేట్ ఉన్న సినిమాలు అంతకుముందు మనం చాలా చూశాం.
కానీ కిరణ్ అబ్బవరం ఇలాంటి పాత్ర పోషించడం ఇదే మొదటిసారి. సినిమా కథ మనకి తెలిసిందే. పెద్దగా కొత్తగా ఏమీ అనిపించదు. సినిమా ముందుకి నడుస్తున్నా కూడా నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆసక్తి ప్రేక్షకులకు ఒక్క చోట కూడా ఉండదు. సినిమాలో చాలా పంచ్ డైలాగ్స్ ఉంటాయి. కొన్ని డైలాగ్స్ సీరియస్ గా చెప్తున్నా కూడా ప్రేక్షకులకు చాలా కామెడీగా అనిపిస్తాయి.
సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది కానీ అది కూడా ప్రేక్షకులకి రొటీన్ గా అనిపిస్తుంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ఈ పాత్రకి తగ్గట్టుగా చేశారు. హీరోయిన్ కేవలం పాటల కోసం మాత్రమే ఉన్నారు ఏమో అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ సినిమా కథ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- కిరణ్ అబ్బవరం
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- కొన్ని డైలాగ్స్
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
- కొన్ని ఎలివేషన్స్
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
అంతకుముందు మనం ఇలాంటి సినిమాలని చాలా చూశాం. సినిమా నుండి అస్సలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏదో ఒక సినిమా చూద్దాం అని అనుకునే వారికి మీటర్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article