Home Filmy Adda Nenu Meeku Baaga Kavalsinavaadini Review : “కిరణ్ అబ్బవరం” కి హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Nenu Meeku Baaga Kavalsinavaadini Review : “కిరణ్ అబ్బవరం” కి హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya
  • చిత్రం : నేను మీకు బాగా కావాల్సిన వాడిని
  • నటీనటులు : కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, సోను ఠాకూర్.
  • నిర్మాత : కోడి దివ్య దీప్తి
  • దర్శకత్వం : శ్రీధర్ గాదె
  • సంగీతం : మణి శర్మ
  • విడుదల తేదీ : సెప్టెంబర్ 16, 2022

స్టోరీ :

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు నేను నీకు బాగా కావాల్సిన వాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ తో పాటు లవ్ స్టోరీ కూడా ఉన్న ఒక ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందింది.

nenu meeku baaga kavalsinavaadini movie review

రివ్యూ :

గత కొంత కాలం నుండి కిరణ్ అబ్బవరం తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోల్లో ఒకరు. సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక కమర్షియల్ అంశాలు ఉన్న సినిమా అని అర్థమవుతుంది. కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు. ఇలాంటి సినిమాలు మనం అంతకు ముందు చాలా సార్లు చూసాం. చాలా కమర్షియల్ సినిమాల్లో ఉన్న సీన్స్ ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి.

nenu meeku baaga kavalsinavaadini movie review

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో నటించడం మాత్రమే కాకుండా డైలాగ్స్ కూడా రాశారు. హీరోయిన్స్ కి నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దక్కలేదు. మణిశర్మ అందించిన సంగీతం బాగున్నా కూడా అది సినిమాని కొంతవరకు మాత్రమే ముందుకు తీసుకెళ్లగలుగుతుంది. కానీ సినిమాలో మాత్రం కథ విషయంలో కానీ ఎమోషన్స్ విషయంలో కానీ ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమాలో ఎస్.వి.కృష్ణారెడ్డి, బాబా భాస్కర్ ఇలా చాలామంది తెలిసిన నటులు ఉన్నారు. కానీ వారందరి పాత్రలు కూడా గొప్పగా లేవు.

nenu meeku baaga kavalsinavaadini movie review

ప్లస్ పాయింట్స్ :

  • మణిశర్మ సంగీతం
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • బలహీనమైన కథనం
  • రొటీన్ స్టోరీ

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

సినిమా నుండి పెద్దగా ఏమీ ఆశించకుండా వీకెండ్ కి ఏదో ఒక సినిమా చూద్దాం అనుకునేవారికి నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

You may also like