రాజా వారు రాణి గారు వంటి సినిమాలతో గత కొంత కాలం నుండి గుర్తింపు సంపాదించుకుంటున్న యువ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రోడ్ యాక్సిడెంట్ లో ప్రాణాలను విడిచారు. ఇవాళ కిరణ్ సోషల్ మీడియా వేదికగా తన అన్నని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
Video Advertisement
తన అన్నతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన కిరణ్, “తన అన్న, వారిద్దరిలో ఎవరో ఒకరు ఏదైనా సాధించాలి అని అనుకునే వారు అని, తాను హీరో అవ్వడం కోసం తన సోదరుడు చాలా కష్టపడ్డారు అని, ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో తన సోదరుడు లేరు” అని రాసారు.
“ఫొటోలో నా వెనకాల ఉన్నది మా అన్న “అబ్బవరం రామాంజులు రెడ్డి”. రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి … మీ ఆనందం కోసం కష్టపడేవాళ్ళు ఉంటారు అది మీరు పొందకుండా పోతే వాళ్ళు తట్టుకోలేరు.” అని రాసారు కిరణ్ అబ్బవరం. రామాంజులు మృతిపట్ల పలువురు నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.