Home Filmy Adda Vinaro Bhagyamu Vishnu Katha Review : హీరో “కిరణ్ అబ్బవరం” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Vinaro Bhagyamu Vishnu Katha Review : హీరో “కిరణ్ అబ్బవరం” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya
  • చిత్రం : వినరో భాగ్యము విష్ణు కథ
  • నటీనటులు : కిరణ్ అబ్బవరం, కాశ్మీర, మురళీ శర్మ.
  • నిర్మాత : బన్నీ వాస్
  • దర్శకత్వం : మురళి కిషోర్ అబ్బూరు
  • సంగీతం : చైతన్ భరద్వాజ్
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 18, 2023

vinaro bhagyamu vishnu katha movie review

స్టోరీ :

విష్ణు (కిరణ్ ఆబ్బవరం) తిరుపతిలో ఒక లైబ్రేరియన్. దర్శన (కాశ్మీర) అనే ఒక యూట్యూబర్ తన నంబర్ కి చివరి అంకె ముందు ఉన్న, అలాగే వెనుక ఉన్న నంబర్ కి కాల్ చేస్తుంది. వారిలో విష్ణు ఒకడు. అలాగే శర్మ (మురళీ శర్మ) అనే వ్యక్తి కూడా వారికి పరిచయం అవుతాడు. తర్వాత వారు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? అసలు వాళ్ళ కథ ఏంటి? ఎందుకు దర్శన శర్మని చంపాల్సి వస్తుంది? విష్ణు ఏం చేశాడు? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

vinaro bhagyamu vishnu katha movie review

రివ్యూ :

ఇటీవల కాలంలో వరుస చిత్రాలతో ఫేమస్ అయిన హీరో కిరణ్ అబ్బవరం. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు విడుదల చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటివి రావడం అరుదు. మొదలు అవ్వడం చాలా మామూలుగా మొదలవుతుంది. కానీ తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా అవుతుంది.

vinaro bhagyamu vishnu katha movie review

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నటీనటులు అందరూ తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు. చైతన్ భరద్వాజ్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. కానీ ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ కి లీడ్ ఇచ్చే సీన్స్ ఉన్నాయి తప్ప పెద్దగా కథ ఏమీ ఉండదు. అందులో కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • కాన్సెప్ట్
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్
  • కొన్ని ల్యాగ్ అయిన సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారికి వినరో భాగ్యము విష్ణు కథ ఒక్క సారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

You may also like