Ads
గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటిరెడ్డి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.. సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో అసలు సినిమా కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కథ:
విజయనగరం అనే ఒక గ్రామానికి చెందిన కోదండపాణి అలియాస్ వీ రవిచంద్రన్ గర్భవతైన భార్యతో పాటు ఊరు విడిచి వెళతాడు. అయితే బస్సులోనే భార్య ప్రసవించి మృతి చెందడంతో, ఆ బిడ్డను కోదండపాణి ఒక్కడే పెంచుకుంటాడు. ఆ పిల్లవాడే అభి అలియాస్ కిరీటి రెడ్డి. చిన్నప్పటి నుంచే తండ్రి ప్రేమను ఒత్తిడిగా భావించిన అభి, స్వేచ్చ కోసం సిటీకి వెళ్లి కాలేజీలో జాయిన్ అవుతాడు అక్కడే స్ఫూర్తి అలియాస్ శ్రీలీలని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. చివరికి ఆమె పని చేసే కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదిస్తాడు. ఆ కంపెనీలో సీఈఓగా ఉండే విజయ సౌజన్య అలియాస్ జెనీలియాకి అభి అంటే మొదటి నుంచి నచ్చదు. కానీ ఒక సందర్భంలో ఇద్దరూ కలిసి విజయనగరానికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఊరితో విజయకి ఉన్న అనుబంధం ఏమిటి? అభి, విజయ మధ్య ఉన్న లింక్ ఏంటి? అనేవి తెలియాలంటే ఈ సినిమా కథ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్త ఏమి కాదు అని చెప్పాలి. ప్రేక్షకులకు ఈ కథ తెలిసినదిగా అనిపించినప్పటికీ కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్. ఈ విషయంలో డైరెక్టర్ రాధాకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పాలి. మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం కిరీటి స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ లతో నిండిపోయింది. వైరల్ అయిన వయ్యారి పాట మొదలుకుని, ఫన్నీ గ్యాంగ్ ఎంట్రీలు, లవ్ ట్రాక్ లు ఫస్ట్ హాఫ్‌కి బలం అయ్యాయి అని చెప్పవచ్చు. తర్వాత జెనీలియా ఎంట్రీతో కథ కాస్త మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి మధ్య ఉన్న బంధం, ఎమోషనల్ ట్విస్టులు సినిమాకి బలంగా మారాయి. క్లైమాక్స్ మాత్రం ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించిందని చెప్పవచ్చు.
నటీనటుల పనితీరు :
కిరీటీ తన టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. మరీ ముఖ్యంగా డ్యాన్స్ లు మాత్రం ఇరగదీసేశాడని చెప్పాలి. మొదటి సినిమాతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే నటనపరంగా కూడా మంచి మార్కులే కొట్టేశాడు హీరో కిరీటిరెడ్డి. అదేవిధంగా ఫైట్లు, సన్నివేశాలలో కూడా అద్భుతంగా చేశారు. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. మొత్తానికి మొదటి సినిమాతోనే హీరో కిరీటీ మంచి మార్కులు కొట్టేశాడు. శ్రీలీల రోల్ కి మంచి మార్కులే పడ్డాయి. జెనీలియాకు మాత్రం టెర్రిఫిక్ రోల్ పడింది. ఆమె రోల్ సినిమాకి చాలా కీలకం. కార్పొరేట్ లుక్‌తో, ఓ మెచ్యూర్డ్ క్యారెక్టర్‌లో సూపర్‌గా నటించింది జెనీలియా. మిగిలిన నటీనటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతికత:
డెవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి అసలైన హైలైట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. కాగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎమోషనల్ సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా, గ్రాండ్ గా కనిపించింది. ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్షన్ పరంగా కూడా పనితనం కూడా బాగుంది. కెమెరా వర్క్స్ కూడా బాగున్నాయి. మ్యూజిక్ కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని చెప్పాలి.
రేటింగ్: 3.5/5
Video Advertisement
End of Article