హీరోయిన్ ఇషా చావ్లా గుర్తుందా.? సినిమాలకు దూరం అవ్వడానికి కారణం ఇదేనా ?

హీరోయిన్ ఇషా చావ్లా గుర్తుందా.? సినిమాలకు దూరం అవ్వడానికి కారణం ఇదేనా ?

by Megha Varna

Ads

తండ్రి చేసే వృత్తినే చేపట్టి పైకి వచినవాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం . ఈ సంప్రదాయం మనకు ఎక్కువగా చిత్ర పరిశ్రమలో  కనిపిస్తుంది . తండ్రి చేసిన డబ్బింగ్ ప్రొఫెషన్ చేసి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మరియు ఒక విలక్షణమైన నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు  సాయి కుమార్ . ఈయన కొన్ని వందల చిత్రాలకు తెలుగు తమిళ కన్నడ లలో అందించి ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు .

Video Advertisement

కాగా సాయికుమార్ తనయుడు ఆది తెలుగు చలన చిత్రసీమ కు కే.విజయ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావాలి చిత్రంతో తెరంగ్రేటం చేసారు . ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను అందుకొని సాయికుమార్ తనయుడిలో చాల విషయం వుంది అని అనుకొనేలా చేసింది ..తర్వాత లవ్లీ చిత్రం కూడా బాగానే అలరించింది .అయితే ప్రేమకావాలి చిత్రంలో  ఆది సరసన నటించిన హీరోయిన్ ఇషా చావ్లా .ఇషా కి కూడా ప్రేమకావాలి చిత్రమే మొదటి సినిమా .తర్వాత ఇద్దరు బాగానే అవకాశాలు దక్కించుకొని కొన్ని చిత్రాలలో చేసారు. కానీ ఇషా నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టడంతో సినీ పరిశ్రమలో ఎక్కువ రోజులు రాణించలేకపోయింది .

isha chawla latest pics

isha chawla latest pics

అయినప్పటికి సోషల్ మీడియా లో ఎప్పుడు అభిమానులకి అందుబాటులో వుంటూ తన వ్యక్తిగత ఫోటోలు తన ట్రిప్ ల వివరాలు షేర్ చేస్తూ సామజిక విషయాలపై స్పందిస్తూ ఉంటారు  ఇషా .అయితే ఈ మధ్య కాలంలో ఇషా చావ్లా ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుందని అందువల్లనే సినీ చిత్రసీమ కు దూరం అయిందని పలు కధనాలు వినిపిస్తున్నాయి .అయితే తాజాగా తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో తాను ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి .

isha chawla latest pics

isha chawla latest pics

దాంతో అభిమానులు కూడా ఆమెకి పెళ్లి అయిందని అని అనుకుంటున్నారు .పెళ్లిపై వస్తున్నా విషయాలే ఇషా మాత్రం స్పందించడం లేదు .ఈ వార్తలు బాగా ఎక్కువగా వినిపించడంతో త్వరగా ఈ విషయంపై స్పందించాలని ఫాన్స్ కోరుతున్నారు .కాగా ఇప్పటికే తెలుగు కన్నడలో దాదాపుగా 7 పైగా చిత్రాలలో ఇషా నటించింది .ఇందులో కమెడియన్ కం హీరో సునీల్ తో రెండు సినిమాలో నటించింగా ,హీరో బాలకృష్ణ తో శ్రీమన్నారాయణ అనే చిత్రం లో నటించింది .


End of Article

You may also like