భరించేవాడు భర్త అంటారు..కానీ అందరూ భర్తలు భరించరు సరికదా బాధలు పెడుతుంటారు..కొందరు కామంతో కళ్లు మూసుకుపోయి..ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.. కన్నూమిన్ను ఎరగకుండా కన్న కొడుకు ముందే  కట్టుకున్న భార్యని స్నేహితులతో  కలిసి అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతుంది.

Video Advertisement

representative image

 

కేరళ రాజధాని తిరువనంతపురంలో కడినంకలం ప్రాంతానికి చెందిన వ్యక్తి తన భార్యని, ఏడాదిన్నర వయసు ఉన్న కుమారున్ని తీసుకుని పుత్తుకురుచ్చి బీచ్  కి వెళ్లాడు.. అక్కడ కాసేపు గడిపిన తర్వాత స్నేహితుని ఇంటికి వెళ్దాం అని చెప్పి భార్యని , బిడ్డని బీచ్ దగ్గరలో ఉన్న ఒక ఇంటికి తీసుకుని వెళ్లాడు..తీరా అక్కడ భర్త స్నేహితులు ఐదుగురు ఉండడంతో మొదట కంగారు పడిన మహిళ..ఇంటికి వెళ్లిపోదాం అంటూ వారించింది..

representative image

కానీ పథకం ప్రకారమే అక్కడికి భార్యని వెంటపెట్టుకు వెళ్లిన భర్త బలవంతంగా ఆమెతో మద్యం తాగించి ..కన్న కొడుకు ముందే భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు..అంతటితో ఆగక సిగరెట్లతో ఒంటిపై కాల్చి పైశాచిక ఆనందం పొందారు..ఎలాగోలా అక్కడినుండి తప్పించుకున్న మహిళ సాయం కోసం అర్దిస్తూ రోడ్డుపైకి పరుగు పెట్టింది..అటుగా కారులో వెళ్తున్న ఇద్దరు యువకులు  రోడ్డుపై ఏడుస్తూ కూర్చున్న మహిళను గుర్తించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.

representative image

పోలీస్ స్టేషన్ కి చేరుకున్న మహిళ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు ఫైల్ చేసారు పోలీసులు..రేప్ కేస్ తో పాటు ఇతరత్రా సెక్షన్లతో పాటు..పిల్లాడి ముందు భార్యని చిత్రహింసలు పెట్టినందుకు గాను పోక్సో(POCSO) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మహిళ శరీరంతో పాటు ప్రైవేట్ బాగాల్లో కూడా గాయాలున్నట్టు పరీక్షల్లో తేలింది.. భర్తతో కలిపి మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు..మరోవైపు కేరళ మహిళా కమీషన్ కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.