దేశవ్యాప్తంగా కరోనా వచ్చిన వాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. వారిలో చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చినా కానీ వైద్యుల సహాయంతో కోలుకుంటున్నారు. కానీ ఇటీవల తెలిసిన విషయం ఏంటంటే కరోనా తగ్గిపోయినా కూడా దాని ప్రభావం చాలాకాలం వరకు ఉంటుందట. ఒకసారి కరోనా వచ్చి తగ్గింది అంటే కచ్చితంగా మనిషి శరీరంలో ఏదో ఒక భాగం దెబ్బ తినే ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు పాడయ్యే అవకాశం ఉంది. అలాగే గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే సూచనలు కూడా ఉంటాయట.

షెరీ అంటోయింట్ అనే నర్సు ట్విట్టర్ లో ఈ విషయం గురించి మాట్లాడారు.”కరోనా అంత భయంకరమైన వ్యాధి ని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఒకవేళ పేషంట్ కోలుకున్నాను అని చెప్తే తను తిరిగి మామూలు గా ఉండొచ్చు అని కాదు. అలా కోలుకున్న ప్రతి వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి లేదా గుండెపోటు రావడం లాంటివి అవుతాయి” అని అన్నారు.

షెరీ కరోనా తో ఆస్పత్రిలో చేరిన పేషెంట్ల లో చూసిన లక్షణాలు ఇవి

  • రక్తం గడ్డ కడుతుంది. కానీ అది మనం గుర్తించలేము. రక్తం గడ్డకట్టడం తో శరీరం నల్లగా మారుతుంది.
  • చర్మంపై పుండ్లు పడతాయి. గట్టిగా రుద్దితే చర్మం రాలుతుంది ఏమో అన్నట్టుగా ఉంటుంది.
  • శరీరం చాలా గట్టిగా అవుతుంది. వాపులు, బొబ్బలు వస్తాయి. పగుళ్లు ఏర్పడతాయి. శరీరమంతా చాలా పొడిగా తోలు లేచినట్లు ఉంటుంది.

  • ప్రతి ఒక్కరికి హార్ట్ బీట్ రేట్ మారుతుంది. కారణం ఏంటి అనేది తెలియదు. కానీ పేషెంట్ కి గుండె సాధారణంగా కొట్టుకోదు. అంటే హార్ట్ బీట్ సాధారణంగా మనిషికి ఉండాల్సిన రేంజ్లో ఉండదు.
  • మూత్రపిండాలు పాడవుతాయి. ఎరుపు రంగు లో కి మారి వాచినట్టు అవుతాయి. ఇది కూడా ఎందుకు అవుతుంది అనే దానికి కారణం ఇప్పటి వరకు తెలియలేదు.
  • పేషంట్ కి ఫోలే కాథెటర్, లేదా యూరినల్ ట్యూబ్ కచ్చితంగా పెట్టాల్సి వస్తుంది.

  • చర్మం గట్టిగా అయిపోవడంతో శ్వాస ఇబ్బందులు వస్తాయి. వెంటిలేటర్ పెట్టినా కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. చర్మం మళ్లీ మామూలుగా అవ్వడానికి స్నానం చేయించడం లేదా శుభ్రపరచడం లాంటివి చేస్తే చర్మం నీలిరంగులో మారిపోతుంది.
  • ఫీడింగ్ కూడా ట్యూబ్ తోనే చేయాల్సి వస్తుంది. అలా ట్యూబ్ ఫీడింగ్ ఉన్న పేషెంట్ లకి పైన చెప్పిన లక్షణాల్లో కచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది.

ఇవన్నీ చూసిన చాలా మంది పేషంట్ లు తమకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి అని చెప్పారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఒక పేషంట్ తనకి గుండె కి సంబంధించిన సమస్య ఎదురైంది అని, రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెపోటు వచ్చిందని డాక్టర్లు స్టెంట్ వేశారు అని చెప్పారు.

మరొక వ్యక్తి మూత్రపిండాల సమస్య వచ్చింది అని, డయాలసిస్ చేయాలి అన్నారు అని, దగ్గు, హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం, ఉబ్బసం సమస్యలు ఎదురవుతున్నాయి అని, అంతకు ముందు ఎప్పుడూ తనకు ఇలాంటి సమస్యలు లేవు అని, ఇప్పుడే ఇలాంటివన్నీ వచ్చాయి అని చెప్పారు.