హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి “కొంపెల్ల మాధవి లత” ఆస్తుల వివరాలు ఎంతో తెలుసా..?

హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి “కొంపెల్ల మాధవి లత” ఆస్తుల వివరాలు ఎంతో తెలుసా..?

by Harika

Ads

హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత ప్రస్తుతం ప్రచార పనుల్లో ఉన్నారు. తొలి విడత అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ వాళ్లు మాధవి లత పేరుని ప్రకటించారు. అప్పుడు మాధవి లత వార్తల్లో నిలిచారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీకి దిగుతున్నారు. గత బుధవారం మాధవి లత బిజెపి పార్టీ నుండి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అందులో ఆఫిడవిట్ లో ఆవిడ ఆస్తుల వివరాలు కూడా పేర్కొన్నారు. మాధవి లత తన ఆస్తులని 221 కోట్లుగా పేర్కొన్నారు. మాధవి లత భర్త కొంపెల్ల విశ్వనాథ్, వారి ముగ్గురు పిల్లలకి కలిపి 165.46 కోట్లు ఆస్తులు ఉన్నాయి.

Video Advertisement

kompella madhavi latha assets

మాధవి లత, విశ్వనాధ్ దంపతులకు 55.91 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలలో .25.20 కోట్ల పెట్టుబడితో పాటు 31.31 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అంతేకాకుండా విరించి లిమిటెడ్ లో 7.80 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 3.78 కోట్లు విలువ చేసే ఆభరణాలు ఉన్నాయి. గురించి లిమిటెడ్ లో మాధవి లత భర్తకి 52.36 కోట్ల షేర్ తో పాటు 88.31 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వారి పిల్లలకి 45 కోట్లకు పైగా చరాస్తులు ఉన్నాయి. దాంతో మొత్తంగా 221.37 కోట్లు ఆస్తులు ఉన్నాయి. మాధవి లతకి 6.32 కోట్ల స్థిరాస్తులు, ఆమె భర్తకి 49.59 కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి.

kompella madhavi latha assets

హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు, వాణిజ్య భూములతో పాటు, నివాస భవనాలు కూడా ఉన్నాయి. 90 లక్షల అప్పు కూడా ఉంది అన్నట్టు పేర్కొన్నారు. ఈ బుధవారం నాడు మాధవి లత తన నామినేషన్ దాఖలు చేసి ఎలక్షన్ కమిషన్ కి అందజేశారు. మాధవి లత వయసు 49 సంవత్సరాలు. మొదటిసారిగా బీజేపీ నుండి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. మాధవి లత హైదరాబాద్ లోనే నివసిస్తారు. ఎవరు ఊహించని విధంగా బీజేపీలో మాధవి లత కి సీట్ దక్కింది. మాధవి లత ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంతో యాక్టివ్ గా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ALSO READ : IPL ఫైనల్ మ్యాచ్ డేట్ ని 25 కి మార్చాలని RCB ఫ్యాన్స్ డిమాండ్.. ఎందుకో తెలుసా.?


End of Article

You may also like