మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు .ప్రభాస్ హీరో గా నటించిన మిర్చి చిత్రం తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు దర్శకుడు కొరటాల శివ .తర్వాత సామజిక సమస్యలను కథా వస్తువుగా తీసుకుని చిత్రాలు తీసి ఒక ప్రత్యేకమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ మెగాస్టార్ ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే .కాగా ఈ సినిమాపై ఆశక్తి పెరిగేలా మెగాస్టార్ కొన్ని అప్డేట్స్ ఇస్తున్నారు ..

Video Advertisement

గతంలో జూనియర్ ఎన్టీఆర్ ,కొరటాల కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే .కాగా ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రకృతిని అమితంగా ప్రేమించే వ్యక్తిగా దర్శనమిస్తాడు.కాగా ఈ పాత్ర ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది .కాగా ఆచార్య సినిమాలో తన పాత్ర కూడా అదే మాదిరిగా నేచర్ లవర్ గా ఉండబోతున్నట్లు మెగాస్టార్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ..

ఇక సినీ వర్గాలలో వినిపిస్తున్న కధనం ప్రకారం ఆచార్య అసలు పాయింట్ ఇదేనని ఒక వార్త వైరల్ గా మారింది .మెగాస్టార్ మాజీ నక్సలైట్ అని ముందు నుండి ఒక వార్త ప్రచారంలో ఉంది .అయితే ఆయన ప్రకృతితో పాటు పురాతన దేవాలయానికి సంబందించిన ఒక సమస్య మీద పోరాడతాడట .ఈ నేపథ్యంలో రాజకీయపరంగా దేవాలయాలపై తీసుకునే ఒక కీలక నిర్ణయం చుట్టూ ఈ కథ నడుస్తుందని టాక్ .