KRISHNA MUKUNDA MURARI: కృష్ణ ,మురారి కి నిజం చెబుతుందా.. వణికిపోతున్న ముకుంద..!

KRISHNA MUKUNDA MURARI: కృష్ణ ,మురారి కి నిజం చెబుతుందా.. వణికిపోతున్న ముకుంద..!

by Mounika Singaluri

Ads

కృష్ణ ముకుందా మురారి.. ఈ సీరియల్ రోజుకో ట్విస్ట్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ సీరియల్ లో ఇద్దరు గుమ్మల మధ్య ఇరుక్కున్న కలియుగ శ్రీకృష్ణుడు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కావడం లేదు. ప్రస్తుతం కృష్ణకు పెళ్లయింది అని తెలుసుకున్న మురారి బాగా డిస్టర్బ్ అయినట్లు కనిపిస్తున్నాడు. అంతేకాదు ఆమె హస్బెండ్ ఎవరు తెలుసుకోవాలి అని కింద మీదా పడిపోతున్నాడు. ఈ నేపథ్యంలో మధుకర్ కి ఫోన్ చేసి విషయం తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు.. అయితే ఇంతలో ముకుంద ఫోన్ చేసి నిజం చెప్పద్దని బెదిరించడంతో విషయం బయటపడకుండా ఆగిపోతుంది.

Video Advertisement

ఇంటికి వచ్చి ముకుందని కూడా అదే మాట అడుగుతాడు కృష్ణ.. బయట వాళ్ల గురించి ఆలోచించడం మాని పెళ్లి గురించి పట్టించుకోమని చెప్పి ముకుంద తప్పించుకుంటుంది. కృష్ణ పడుతున్న అంతర్ మదనం చూసి బాధపడిన భవాని.. తన బిడ్డ బతుకుని నాశనం చేశారని అందరిని తిట్టి ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోపక్క భవాని వేసిన ప్లాన్ రేవతి ద్వారా తెలుసుకుంటుంది కృష్ణ. కృష్ణకు పెళ్లి జరిగింది అని చెప్పినప్పటి నుంచి మురారి కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు అని రేవతి చెబుతుంది.

దానికి కృష్ణ పెద్ద అత్తయ్య తాను చాలా తెలివైన దాన్ని అనుకొని పప్పులో కాలేసింది.. నాకు పెళ్లయింది అని తెలిస్తే ఏసీబీ సార్ గమ్ముగా ఎందుకు ఉంటాడు.. అనవసరంగా ఆయన్ని డిస్టర్బ్ చేశారు.. ఇప్పుడు కచ్చితంగా గతం గుర్తుకు వచ్చే అవకాశం వాళ్లే కల్పించారు. చూస్తూ ఉండండి ఒక రెండు మూడు రోజుల్లో ఆయనకు గతం గుర్తు వచ్చే తీరుతుంది అని కృష్ణ కాన్ఫిడెంట్ గా చెప్పింది. గతం ఎలాగో గుర్తుకొస్తుంది అది మనకు తెలుసు అనుకోండి.. అయితే కృష్ణ చెప్పిన ఆ రెండు మూడు రోజులు.. రెండు మూడు వారాలుగా మారుతాయా లేక రెండు మూడు సంవత్సరాలుగా కొనసాగుతాయి అనేది క్లారిటీగా తెలియడం లేదు.


End of Article

You may also like