సూపర్ స్టార్ “కృష్ణ” చేయాల్సిన సినిమాని “చిరంజీవి” చేశారా..? ఆ సినిమా ఏది అంటే..?

సూపర్ స్టార్ “కృష్ణ” చేయాల్సిన సినిమాని “చిరంజీవి” చేశారా..? ఆ సినిమా ఏది అంటే..?

by kavitha

Ads

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన స్టార్స్ లో ఒక ముఖ్య పాత్ర పోషించారు సూపర్ స్టార్ కృష్ణ.ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ గారి మొదటి వర్ధంతి సందర్భంగా సినిమా రంగానికి చెందిన వారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Video Advertisement

ఈ సందర్భంగా ఆయన చిత్రాల గురించి కొన్ని సంఘటలను కృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ మాధవ్ రావు పంచుకున్నారు.కౌబాయ్ తరహా చిత్రాలను ప్రేక్షకులకు అందించింది మొదటి తరం హీరో కృష్ణ గరే.ఇప్పటికి కౌబాయ్ పాత్రల గురించి వస్తే మొదట వచ్చే పేరు కృష్ణ గారిదే.

“ఆంధ్ర జేమ్స్ బాండ్”గా లక్షల అభిమానులను సంపాదించుకున్నారు కృష్ణ గారు.తనకు వచ్చిన అవకాశాలలో కొన్ని వేరే నటులను తీసుకోవాలని సలహా ఇచ్చేవారు అంట.అల ఆయన వదులుకున్న సినిమాల గురించి తాజాగా మాధవ్ రావు మాట్లాడారు. చిరంజీవి గారి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలలో “ఖైదీ” ఒకటి.ఈ ఫిలిం స్క్రిప్ట్ మొదట కృష్ణ గారి దగ్గరకి వచ్చింది అంట. కానీ చిరంజీవిని తీసుకోవాలి అని అతను నృత్యం బాగా చేస్తారని కృష్ణ గారు సూచించారు అని మాధవ్ రావు చెప్పారు.

“ఖైదీ” సినిమా ఆ కాలం లో చిత్రం సంచలనం సృష్టించింది.దర్శకుడు A కోదండ రమి రెడ్డి గారు మంచి యాక్షన్ చిత్రంతో కృష్ణ గారి వద్దకు వచ్చారు.అది ఆంగ్ల చితమైన ఫస్ట్ బ్లడ్ చిత్రం ని ఆధారం గా తీసుకొని ఖైదీ చిత్రాన్ని రూపొందించారు.ఈ విధం గా యాక్షన్ సినిమాలలో మొదటి పేరు దర్శక నిర్మాతలకు గుర్తుకు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారిదే.

 

అలాగే రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారు చేసిన “కటకటాల రుద్రయ్య” సినిమా కోసం ముందుగా దర్శక-నిర్మాతలు ముందుగా కృష్ణ గారి వద్దకే వచ్చారంట.కానీ కృష్ణం రాజు గారి అయితేనే ఈ చిత్రానికి బాగా సరిపోతారు అని తిరస్కరించారు అని తెలుస్తోంది.ఆ చిత్రం విడుదల అయ్యాక కృష్ణమ్ రాజు గారి నటనకు మంచి మార్కులు పడి, ప్రేక్షకులు థియేటర్ లో చూసి పొంగిపోయారు.


End of Article

You may also like