Ads
మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అని అంటారు. ఎంతో మంది సెలబ్రిటీలను పోలిన ఎంతో మంది మామూలు మనుషులని మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. అలాగే ఒక సెలబ్రిటీకి అదే ఇండస్ట్రీలో ఉన్న ఇంకొక సెలబ్రిటీకి మధ్య పోలిక ఉండడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం. అలా ఒక హీరోయిన్ ని పోలిన ఇంకొక హీరోయిన్ ఉన్నారు.
Video Advertisement
ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు క్రితి శెట్టి. మొదటి సినిమా అయినా కూడా ఎక్కడ అలా అనిపించకుండా చాలా కాన్ఫిడెంట్ గా నటించారు. అందుకే తన మొదటి సినిమా అయిన ఉప్పెన సినిమాతోనే ప్రేక్షకులందరికీ చాలా చేరువ అయ్యారు. ఇప్పుడు కింద ఉన్న ఆమె ఫోటోని చూడండి.
తను కూడా ఎన్నో సినిమాల్లో సీరియల్స్ లో నటించారు. తను చూడడానికి కొంచెం క్రితి శెట్టి లానే ఉన్నారు కదా? ఈ నటి పేరు విద్యా విను మోహన్. విద్య 2007 లో దండాయుధపాణి అనే ఒక తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఎన్నో తమిళ్, మలయాళం సినిమాలతో పాటు కొన్ని కన్నడ సినిమాల్లో కూడా నటించారు. 2013 నుండి సీరియల్స్ లో కూడా నటించడం మొదలుపెట్టారు విద్య.
ఇప్పటివరకు రెండు తమిళ్ సీరియల్స్ లో, రెండు మలయాళం సీరియల్స్ లో నటించారు. విద్య ప్రస్తుతం సన్ టీవీలో టెలికాస్ట్ అయ్యే అభియుం నానుమ్ అనే సీరియల్ లో మీనా పాత్రలో నటిస్తున్నారు. క్రితి శెట్టి లాగా ఉన్న విద్యా విను మోహన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
End of Article