మరోసారి “నాగ చైతన్య”తో కృతి శెట్టి..! రెండు భాషల్లో..!

మరోసారి “నాగ చైతన్య”తో కృతి శెట్టి..! రెండు భాషల్లో..!

by Sunku Sravan

Ads

మెగా అల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ సినిమాతో తెరంగేట్రం చేసిన భామ కృతి శెట్టి. ఆదిలోనే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన ఈ భామ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదిరిపోని ముద్రవేసింది. ఉప్పెన సినిమా తరువాత ఆమె వరుసగా మూడు హిట్లను అందుకుంది.

Video Advertisement

దీంతో ఆమె సినిమాల్లో బీజీబీజీగా అయిపోయింది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఈ సొట్టబుగ్గల సుందరి.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కృతి.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ .. ‘ది వారియర్’ .. ‘ మాచర్ల నియోజకవర్గం’ సినిమాలతో ఈ ఏడాది మరోసారి కనువిందు చేసేందుకు రాబోతోంది. అయితే.. అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్‌. అయితే ఈ సినిమాలో నాగచైతన్యతో రోమాన్స్‌ చేసేందుకు సిద్ధమైంది కృతి శెట్టి.

bangarraju movie review

ఈ సినిమా కథ చెప్పగానే నచ్చి ఓకే చెప్పిందట. ఈ సినిమా తమిళ బాషలో కూడా విడుదలవుతుంది కాబట్టి కృతికి కూడా ప్లస్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా. ఈ సినిమా నాగచైతన్యకు 22వది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సినిమాలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరీ కెమస్ట్రీపై బాగా కుదరింది కూడా. అయితే వీరిద్దరి కాంబోలో ఈ సినిమాతో రెండవది.


End of Article

You may also like