నీ బెస్ట్ ఫ్రెండ్ అదే…నీకు పెద్ద శత్రువు కూడా అదే..! సుశాంత్ పై కృతి సనన్ ఎమోషనల్ పోస్ట్.!

నీ బెస్ట్ ఫ్రెండ్ అదే…నీకు పెద్ద శత్రువు కూడా అదే..! సుశాంత్ పై కృతి సనన్ ఎమోషనల్ పోస్ట్.!

by Megha Varna

Ads

ధోని బయోపిక్ లో నటించిన సుశాంత్ సింగ్ రాజపుట్ ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తిండిపోతారు.కాగా ఆయన ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే సుశాంత్ సింగ్ రాజపుట్ మరణంతో బాలీవుడ్ సినివర్గమంతా విషాదంలో మునిగిపోయారు.కాగా సుశాంత్ మరణం పై కృతి సనన్ భావోద్వేగానికి లోనయ్యారు.ఆ వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

కృతి సనన్‌ ఇంస్టాగ్రామ్ లో స్పందిస్తూ ….సుశాంత్ …నీ ఆలోచనలే ని మిత్రులు మరియు ఆవే నీ శత్రువులు అని తెలుసు.కానీ బ్రతడం కంటే చనిపోవడమే మంచి ఆప్షన్ అని నువ్వు భావించడం నన్ను బాధిస్తుంది అని కృతి సనన్ అన్నారు.నీకు చనిపోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ని చుట్టూ నువ్వు ప్రేమించేవాళ్ళు ఉంటె బాగుండేది.నీ లోపల కలిగిన బాధను నేను దూరం చేసినా బాగుండేది అని కృతి సనన్ అన్నారు.నువ్వు ఏ లోకంలో ఉన్న నువ్వు ఆనందంగా ఉండాలని ప్రార్ధన చేస్తాను అంటూ కృతి సనన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.సుశాంత్ ని మరణం నన్ను ఎంతగానో బాధించింది అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు కృతి సనన్ .


End of Article

You may also like