వనస్థలిపురం సూపర్ మార్కెట్ సిబ్బందికి కేటీఆర్ వార్నింగ్…విదేశీయులుగా ఉన్నారని పంపించకపోవడంతో.!

వనస్థలిపురం సూపర్ మార్కెట్ సిబ్బందికి కేటీఆర్ వార్నింగ్…విదేశీయులుగా ఉన్నారని పంపించకపోవడంతో.!

by Sainath Gopi

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఆ పదం వింటేనే భయపడిపోతున్నారు అందరు. మన దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నిత్యావసరాలకోసం తప్ప ఎవరు బయటకి వెళ్ళకూడదు అనే రూల్ పెట్టింది. ఈ నేపథ్యంలో నిత్యావసరసరుకులు అమ్మే దుకాణాలు తెరిచి ఉంటునాయి. సోషల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ మాస్కులు వాడుతూ సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తున్నారు.

Video Advertisement

ఇది ఇలా ఉండగా..వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటనపై కేటీఆర్ గారు ఫైర్ అయ్యారు. స్టోర్ కి వచ్చిన ఇద్దరు వ్యక్తులను స్టోర్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. వారు విదేశీయులనే అనుమానంతో సిబ్బంది వారిపై వివక్ష చూపించారు. దీంతో బాధితులు ఆ సంఘటనను వీడియో తీసి మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ…సామాన్య ప్రజల సమస్యలు తీర్చే కేటీఆర్ గారు ఈ విషయంపై స్పందించారు. ఇలాంటి వివక్ష చూపిస్తే సహించేది లేదని, వివక్ష చూపించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వనస్థలిపురం పోలీసులు వెంటనే స్పందించి ఈ చర్యలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. మణిపూర్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఈ వ్యక్తులు సుమారుగా విదేశీయులను పోలి ఉన్నారు. మణిపూర్ వాసులు సుమారుగా చైనా వాసుల లాగా పోలికలతో వుంటారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను స్టోర్ సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఆధార్ కార్డు చూపించినా వారిని స్టోర్ సిబ్బంది అనుమతించలేదు. ఇకపై ఎక్కడైనా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంటే వెంటనే పోలీస్ కి ఫిర్యాదు చేయమని చెప్పారు.

కరోనా వైరస్ శ్వాస ద్వారా మరియు వ్యాధి సోకినా వ్యక్తిని తాకడం ద్వారా తుమ్ముల ద్వారా దగ్గు ద్వారా వ్యాప్తిసుంది ..తుమ్ములు దగ్గు జలుబు జ్వరం ఉండడం కరోనా లక్షణాలు .కాగా వ్యాధి సోకినా 14 రోజులలో వచ్చే లక్షణాలు ..ఈ లక్షణాలు ఒక్కక్కరిలో ఒక్కో విదంగా ఉంటాయి .కొంతమందిలో మొదట్లో ఈ లక్షణాలు ఏమి కనపడవు .దానికి కారణం వారి ఇమ్మ్యూనిటి సిస్టం బలంగా ఉండటమే . ఇప్పటిదాకా ఈ వ్యాధికి వాక్సిన్ మందు ఏమి కనిపెట్టలేదు ..కాగా శాస్త్రవేత్తలు అందరు 35 కంపిని లకు పైగా ఈ వ్యాధికి మందు కనిపెట్టడానికి పోటీ పడుతున్నారు . చైనా లో ఈరోజున కరోనా వైరస్ బారినుండి బయట పడి సాధారణ పరిస్థితి వచ్చిందంటే అది లాక్ డౌన్ వలెనే సాధ్యపడింది .చైనా 3 నెలలు లాక్ డౌన్ ను కొనసాగించగా ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చింది ..దీనినే ప్రపంచమంతా పాటిస్తుంది ..

 


You may also like