Ads
నితిన్, రష్మిక జంటగా నటించిన “భీష్మ”. ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్ కొట్టింది ఈ చిత్రం. ఇప్పుడు ఈ చిత్రానికి అనుకోని కష్టం వచ్చి పడింది. వెంకీ కుడుములు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వచ్చిన సినిమా ‘భీష్మ’ .వారం రోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. అయితే సినిమా రిలీజ్ అయ్యి వారం కూడా అవ్వకముందే పైరసీ వచ్చేసింది. పైగా ఆ పైరసీ కాపీని టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్లే చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని నిఖిల్ అనే నెటిజన్ దర్శకుడు వెంకీ కుడుములకు తెలియజేసాడు.
Video Advertisement
హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం గమనార్హం. “తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ పైరసీని ప్లే చేసారు. వెంకీ కుడుముల, నితిన్ వెంటనే వీరిపై యాక్షన్ తీసుకోండి’ అంటూ ఆ బస్సు నెంబర్‌తో సహా ఫొటోలను షేర్ చేసాడు. దీనికి దర్శకుడు స్పందించి కేటీఆర్ కు ట్వీట్ చేసారు.
దర్శకుడి ట్వీట్దీ పై కేటీఆర్ వెంటనే స్పందించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్ వేదికగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు సూచించారు. ఈ ట్వీట్ చూడగానే హీరో నిఖిల్ కూడా స్పందించారు. నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా పైరసీ వీడియోను కూడా చాలా బస్సుల్లో ప్లే చేసారని, దయచేసి పైరసీ ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సినిమా ఈనెల 21న విడుదలకాగా.. విడుదలైన నాలుగో రోజే ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని, ఇతర మాధ్యమాలు, సామాజిక వేదికల్లో విస్తరించకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను కోరారు. భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. వారం కూడా కాకముందే ఇలా పైరసీకి గురికావడం వల్ల చిత్ర కలెక్షన్లు దెబ్బతింటాయని చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది.
End of Article