Home News తన మంచి మనసును మరొకసారి చాటుకున్న కేటీఆర్.!

తన మంచి మనసును మరొకసారి చాటుకున్న కేటీఆర్.!

by Mohana Priya

ఎవరికైనా ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి ముందు ఉండే వారిలో మంత్రి కేటీఆర్ ఒకరు. సోషల్ మీడియా ద్వారా అయినా సరే, ఎవరైనా ఏదైనా మెసేజ్ పెడితే కేటీఆర్ వెంటనే స్పందించి, తన వంతు సహాయం చేస్తారు. అయితే, కేటీఆర్ ఇటీవల మళ్ళీ ఒకసారి తన మంచి మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన కొంత మందిని తన కాన్వాయ్ లో ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు.

ktr helps injured people in siddipet

సిద్దిపేట్ అవుటర్ బైపాస్ మెడికల్ కాలేజ్ దగ్గర్లో ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు డివైడర్ ని ఢీకొట్టిన కాళ్లకుంట కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కింద పడ్డారు. అటుగా వెళ్తున్న కేటీఆర్ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే ఆగి రెండు కార్లలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఫోన్ లో సూచించారు. వారిని కాపాడినందుకు ఇద్దరు వ్యక్తులు కుటుంబ సభ్యులు కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

watch video : 

https://twitter.com/revathitweets/status/1419722972172996614

 

You may also like