పాపకు పాలు కావాలి అంటూ అర్ధరాత్రి ట్వీట్…వెంటనే స్పందించిన కేటీఆర్ ఏం చేసారంటే?

పాపకు పాలు కావాలి అంటూ అర్ధరాత్రి ట్వీట్…వెంటనే స్పందించిన కేటీఆర్ ఏం చేసారంటే?

by Sainath Gopi

Ads

ఇటీవల కాలంలో తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మరియు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. అంతేగాక ఎవరైనా వ్యక్తులు తమ ప్రాంతంలో ఫలానా సమస్య ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపితే ఏకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ సమస్యను తీర్చేందుకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్న సంఘటనలను ఇది వరకే మనం చూసాము.

Video Advertisement

అయితే తాజాగా ఓ చిన్నారి అర్ధరాత్రి సమయంలో పాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యను ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కి తెలపగా అర్ధరాత్రి సమయం అయినప్పటికీ కేటీఆర్ స్పందించి చిన్నారి పాపకు పాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో లకాన్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. వీరికి నెలలు నిండిన చిన్నారి పాప కూడా ఉంది.

ఈ మధ్యకాలంలో లకాన్ సింగ్ భార్య మృతి చెందడంతో పాపకి బయట దొరికే టువంటి పాలను పట్టిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో లకాన్ సింగ్ కి చేయడానికి ఎటువంటి పని దొరకలేదు. దీంతో రెక్కాడితే గాని డొక్కాడని లకాన్ సింగ్ పాపకు పాలు కొనలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని గమనించి నటువంటి ఓ యువకుడు అర్ధరాత్రి సమయంలో చిన్నారి పాలు లేక ఇబ్బంది పడుతుందని సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతేగాక ఈ ట్వీట్ కి తెలంగాణ మంత్రి ఇ కేటీఆర్ ని కూడా ట్యాగ్ చేశాడు.

అయితే ఈ యువకుడు ట్వీట్ చేసిన కొద్దిసేపట్లోనే మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ ని అప్రమత్తం చేసి చిన్నారికి పాలు అందజేయాలని సూచించారు. దీంతో వెంటనే డిప్యూటీ మేయర్ తన అనుచరులతో కలిసి చిన్నారి తండ్రి నివాసముంటున్న ప్రాంతానికి వెళ్లి, పాలు మరియు ఒక నెలకు సరిపడా ఎటువంటి నిత్యావసర సరుకులను కూడా అందజేశారు.

అయితే కి కేటీఆర్ ఇలా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా సమస్యలపై స్పందించడం కొత్తేమీ కాదు. గతంలో కూడా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తన దృష్టికి వచ్చినటువంటి పలు సమస్యలపై స్పందిస్తూ వాటిని తీర్చాలంటూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాడు. అంతేగాక సోషల్ మీడియా అనేది సరదాగా చాటింగ్, డేటింగ్ మీటింగ్ లకే కాకుండా ఇతరుల సమస్యలను కూడా తెలుసుకొని తీర్చ డానికి ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ నిరూపించారు.


End of Article

You may also like