కొత్త సంవత్సరంలో సరికొత్తగా కేటీఆర్….ఏం చేసారో తెలుసా…?

కొత్త సంవత్సరంలో సరికొత్తగా కేటీఆర్….ఏం చేసారో తెలుసా…?

by Mounika Singaluri

Ads

కొత్త సంవత్సరం వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు అందరూ ఎంతో సంబరంగా జరుపుకున్నారు. కార్యకర్తలు అభిమానుల శుభాకాంక్షలు అందుగుంటూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అయితే తెలంగాణలో మాజీ మంత్రి టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రం సరికొత్తగా కొత్త సంవత్సరాన్ని జరుపుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే…?

Video Advertisement

పార్టీలు, సంబరాలతో కాకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా వుంచే పారిశుద్ద్య కార్మికులతో కలిసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు కేటీఆర్. సోమవారం పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు వచ్చిన పారిశుద్ద్య కార్మికులతో ముచ్చటిస్తూ, సెల్పీలు దిగుతూ సరదాగా గడిపారు కేటీఆర్. అలాగే నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని కార్మికులందరికి కడుపునిండా భోజనం పెట్టారు. పారిశుధ్ద్య కార్మికులతో కలిసి కేటీఆర్ సహపంక్తి భోజనం చేసారు.

పారిశుద్ద్య కార్మికులతో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు కేటీఆర్. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న కేటీఆర్ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని అన్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ద్వారా కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కేటీఆర్ తెలిపారు.

ఇక బిఆర్ఎస్ ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం కృషి చేశామని, చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న వారికి జీతాలు పెంచి ఒక భరోసా కల్పించామని గుర్తు చేశారు.కార్మికులు ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు, పీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ లీవ్ సదుపాయాలు కల్పించేలా చూడాలని కోరారని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కేటీఆర్ తెలిపారు. మరోపక్క బిఆర్ఎస్ నాయకులందరూ పార్టీ ఆఫీసుకి చేరి కేటీఆర్ కి పూల గుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


End of Article

You may also like