కేటీఆర్ పెళ్లి ఫోటో చూశారా..? వీరి పెళ్లి ఎప్పుడు జరిగింది అంటే..?

కేటీఆర్ పెళ్లి ఫోటో చూశారా..? వీరి పెళ్లి ఎప్పుడు జరిగింది అంటే..?

by kavitha

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు సోమవారం (డిసెంబర్‌ 18) వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకొన్నారు. కేటీఆర్‌ ఈ సందర్భంగా తన సతీమణి శైలిమకు సామాజిక మాధ్యమ వేదికగా పెళ్లి రోజు విషెస్ తెలుపుతూ ఆసక్తికర పోస్ట్ చేశారు.

Video Advertisement

కేటీఆర్ పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, ఫ్యాన్స్, నెటిజన్లు కేటీఆర్‌, శైలిమ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
1976లో జన్మించిన కల్వకుంట్ల తారక రామారావు యూఎస్ లో ఎంబీఏ చేశారు. ఆ తరువాత అమెరికాలో కొన్నేళ్ల పాటు జాబ్ చేశారు. 2006లో తన జాబ్ కి రాజీనామా చేసి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ లో చేరి తన తండ్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ రాజకీయ ప్రవేశం చేశారు. జూన్ 2014లో తెలంగాణ తొలి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.డైనమిక్ లీడర్‌ గా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. ప్రస్తుతం ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే, 2003లో డిసెంబర్ 18న కేటీఆర్‌,  శైలిమల పెళ్లి జరిగింది. ఈ దంపతులకు హిమాన్షు రావు, అలేఖ్య రావు అనే పిల్లలు ఉన్నారు. సోమవారం నాడు వీరి పెళ్లిరోజు సందర్భంగా, 20 సంవత్సరాల క్రితం నాటి పెళ్లి ఫొటోను, భార్య పిల్లలతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన కేటీఆర్‌, “నా అందమైన భార్య శైలిమకు 20వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 2 దశాబ్దాలుగా నాకు మద్దతుగా నిలిచినందుకు మరియు నాకు ఇద్దరు అందమైన పిల్లలను అందించినందుకు, ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు.
మన ప్రయాణం ఇలాగే మరెన్నో ఏళ్లపాటు కొనసాగాలని కోరుకుంటున్నాను.” అంటూ తన భార్య శైలిమకు పెళ్లి రోజు విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కేటీఆర్ పోస్ట్ చేసిన కొన్ని గంటలలోనే ఈ ట్వీట్ కు నెటిజెనల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ  పోస్ట్ కి రిప్లైగా కేటీఆర్ పెళ్లి ఫోటోలతో వీడియోలను క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు.

Also Read: ఉమ్మడి వరంగల్‌లో ఎమ్మెల్యే, మంత్రులు, కలెక్టర్లు ఆడవాళ్లే… ఆ 5 మంది మహిళలు ఎవరంటే.?


You may also like

Leave a Comment