Ads
“కేటీఆర్ అంకుల్ ఎలా ఉన్నారు ..నా పేరు గాయత్రీ ,నేను దేవి నగర్ ,రామకృష్ణాపురం ,సికింద్రాబాద్ లో ఉంటున్నాను.మాకు వాటర్ వచ్చి ఐదు రోజులు అవుతుంది.గిన్నెలు తోముకోవడానికి ,బట్టలు ఉతుక్కోవడానికి ,స్నానం చెయ్యడానికి చాలా ఇబ్బంది అవుతుంది.కాబట్టి మా సమస్యను సీరియస్ గా తీసుకోని మా ఏరియా కి వాటర్ వచ్చేలా చూడమని కెసిఆర్ తాతగారికి చెప్పండి ప్లీజ్” అని చిన్న వీడియో చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఓ బాలిక.
Video Advertisement
ఆ బాలిక ట్వీట్ చేసిన రెండు గంటలలోనే మంత్రి కేటీఆర్ ట్వీట్ కి సమాధానం ఇచ్చారు.కచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తాము.ఒకసారి ఆ ఏరియా జనరల్ మేనేజర్ అక్కడికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలి అని ట్వీట్ కి రిప్లై ఇచ్చారు కేటీఆర్.ప్రతీ రాజకీయ నాయకుడు కేటీఆర్ గారి లాగా ఉంటె ఎంత బాగుంటుంది అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Absolutely will take care @HMWSSBOnline please have local GM visit immediately and @KTRoffice please follow up https://t.co/3Vy4y6Cg2O
— KTR (@KTRTRS) May 25, 2020
ఒకప్పుడు సెలెబ్రెటీలను కలవాలన్న వారితో మాట్లాడాలన్నా ఎన్నో అపాయింట్మెంట్స్ తీసుకుని ఎంతోకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి.ఒక రాజకీయ నాయకుడిని కలిసి సమస్యలు చెప్పుకోవడానికి వీలు ఉండేది కాదు.కానీ మారుతున్నా ఈ కాలంలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారితో అయినాసరే మన సమస్యలు చెప్పుకోవడానికి సోషల్ మీడియా ద్వారా వీలు కుదురుతుంది.
అయితే తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి ఐన కేటీఆర్ ట్విట్టర్ లో ఎప్పుడూ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ తనదాకా వచ్చిన సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతున్నారు.
End of Article