టికెట్ తీసుకోమని అడిగినందుకు…మహిళా కండక్టర్ బట్టలు చించేసి ఆ ప్రయాణికుడు…!

టికెట్ తీసుకోమని అడిగినందుకు…మహిళా కండక్టర్ బట్టలు చించేసి ఆ ప్రయాణికుడు…!

by Sainath Gopi

విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికుడు దారుణానికి ఒడిగట్టాడు. టికెట్ తీసుకోలేదు అని అడిగినందుకు ఎంత నీచంగా ప్రవర్తించాడో తెలుసా? ఈ ఘటన చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే… రోజు లాగానే ఈ రోజు కూడా గుర్రంకొండ మరియు తరికొండ ఊర్ల మధ్య బస్సు నడుస్తుంది. అయితే ఆ బస్సు మదనపల్లి డిపో కు చేరుకుంది. అయితే అక్కడ ఓ ప్రయాణికుడు టికెట్‌ తీసుకోలేదని గమనించిన మహిళా కండక్టర్‌ అతని వద్దకు వెళ్లి టికెట్‌ ఎందుకు తీసుకోలేదని అడిగింది.

Video Advertisement

టికెట్‌ ఎందుకు తీసుకోలేదని అడిగింది మహిళా కండక్టర్. దీంతో ఆ ప్రయాణికుడు చిల్లర లేదు అని చెప్పాడు. అయినా ఆ కండక్టర్ చిల్లర కావాలని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికుడు.. కండక్టర్ పై అసభ్యంగా ప్రవర్తించి.. ఆమెను ఈడ్చి కొట్టాడు. ఆమె మీద దాడి చేయటమే కాకుండా డ్రెస్ చింపివేశాడు. డ్రైవర్‌, ప్రయాణికులు అడ్డుకున్నా లెక్కచేయకుండా అందరి సమక్షంలో కండక్టర్‌పై చేయి చేసుకున్నాడు. వారంతా కలిసి అతడిని అదుపుచేసి పోలీసులకు అప్పగించారు.

తోటి ప్రయాణికులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అతను ఆగలేదు. ఆమెపై పిడిగుద్దులు కురిపించాడు. మహిళ అని కూడా చూడకుండా చేయి చేసుకున్నాడు. చివరికి ప్రయాణికులంతా కలిసి శివారెడ్డిని చితకబాది.. స్థానిక పోలీసులకు అప్పగించారు. స్వలంగా గాయపడిన మహిళా కండక్టర్‌కు ఆస్పత్రిలో చికిత్స అందించారు. తమ తోటి కార్మికురాలిపై దాడిని ఆర్టీసీ కార్మిక నాయకులు ఖండించారు. ఇక ఈ ఘటనపై వాల్మీకిపురం పోలీసులకు కండక్టర్ పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కండక్టర్ చొక్కాను చించడమే కాకుండా.. ఆమెపై పిడిగుద్దులు కురిపిస్తూ తీవ్రంగా దాడి చేశాడు ప్రయాణికుడుని తోటి ప్రయాణికులు చితకబాది పోలీసులకు అప్పగించిన వీడియో నెట్ ఇంట్లో వైరల్ అయ్యింది. ప్రయాణికుడు టికెట్‌ తీసుకోలేదని గమనించిన మహిళా కండక్టర్‌ అతని వద్దకు వెళ్లి టికెట్‌ ఎందుకు తీసుకోలేదని అడిగిన దానికి అతను అలా ఆగ్రహానికి గురై ఆ కండక్టర్‌పై దాడికి దిగడంపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిని శిక్షించవలసిందిగా కోరుతున్నారు.


You may also like

Leave a Comment