లలితా జ్యువలరీ అస‌లు ఓన‌ర్ “కిర‌ణ్ కుమార్” గారు కాదా.? “లలిత” అనే పేరు ఎలా వచ్చిందంటే.?

లలితా జ్యువలరీ అస‌లు ఓన‌ర్ “కిర‌ణ్ కుమార్” గారు కాదా.? “లలిత” అనే పేరు ఎలా వచ్చిందంటే.?

by Mounika Singaluri

Ads

కష్టపడి సంపాదించిన డబ్బు ఊరికే వదులుకోవచ్చా.. బంగారం ధరను కనీసం నాలుగైదు షాపుల్లో కంపేర్ చెయ్యండి. ఏ నగలైనా సరే అసలైన ధర కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకండి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడతామో కదా.. డబ్బులు ఊరికే రావు.’’అంటూ లలిత జ్యువెలరీ యాడ్లో మన ముందుకు వచ్చి అందరిని ఆకర్షించిన వ్యక్తి కిరణ్ కుమార్.

Video Advertisement

ఆ యాడ్ ద్వారా అతను ఎంత పాపులర్ అయ్యాడంటే, ఇప్పుడు ఎవరికైనా లలిత జువెలరీస్ అంటే ఠ‌క్కున గుర్తొచ్చేది కిరణ్ కుమార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటిస్,స్పోర్ట్స్ స్టార్స్ ,మోడల్స్ చేస్తేనే ఏ కంపెనీకి సంబంధించిన కమర్షియల్ యాడ్స్ అయినా సక్సెస్ అవుతాయి అన్న నమ్మకాన్ని పూర్తిగా తలకిందులు చేసిన తెలివైన వ్యాపారవేత్త కిరణ్ కుమార్. తన కంపెనీ అయిన లలిత జువెలర్స్ కి అతని ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా అందరి ప్రశంసలు పొందారు.

ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో లలిత జ్యువెలర్స్ కి సంబంధించిన విషయాలు చర్చిస్తూ దీని అసలు ఓనర్ తాను కాదు అని ఆయన వెల్లడించారు. నెల్లూరు వాస్తవ్యులైన కిరణ్ కుమార్ తొలి దశలో చిన్న చిన్న బంగారు ఆభరణాలు చేసి చెన్నైలోని లలిత జ్యువెలర్స్ కి అమ్మకానికి వెళ్లేవారు. ఈ క్రమంలో ఆ షాపు యజమాని కంద‌స్వామి 1999 లో షాపును అమ్మకానికి పెట్టగా ఈయన కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత కొద్ది కాలంలోనే ఎవరూ ఊహించని విధంగా వేలకోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంటూ ఎన్నో ప్రదేశాలలో బ్రాంచీలు, ఫ్రాంచసైజులు నెలకొల్పుతూ ముందుకు దూసుకు వెళ్లింది.

ఇదిలా ఉండగా లలిత జువెలరీస్ అంటే జయలలితకు సంబంధించినవి అని రూమర్స్ వచ్చేది దానిపైన మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా…. సోనియా అంటే సోనియా గాంధీ అని మోడీ అంటే నరేంద్ర మోడీ అని ప్రతిదీ పాలిటిక్స్ తో ముడి పెట్టే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అలాంటి వారి గురించి నేను పట్టించుకోను,ఎవ‌రేమైన అనుకోని అని ఆయ‌న అన్నారు.

ఈమధ్య హైదరాబాదులో సోమాజిగూడ కూకట్పల్లి దిల్సుఖ్నగర్ ఏరియాస్ లో లలిత జ్యువలరీస్ కు సంబంధించి మూడు బ్రాంచ్లని ఓపెన్ చేశారు. త్వరలో చందానగర్ ,సుచిత్ర సర్కిల్లో కూడా తమ బ్రాంచీలు రాబోతున్నాయని అలాగే నిజామాబాద్ లో కూడా షోరూం ప్లాన్ చేయబోతున్నామని ఈ సందర్భంగా కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే 42 బ్రాంచీలు ఉన్న తమ సంస్థ ఇంకా అభివృద్ధి చేసి త్వరలో 170 షోరూమ్ చేయాలనేది ఆయన ఆలోచన. క్రమంగా సౌత్ ఇండియాలో మంచి పేరు తెచ్చుకుంటున్న లలిత జ్యువెలర్స్ ని నార్త్ ఇండియా లో కూడా విస్తరించాలని ఆయన ఆకాంక్ష.

watch video:


End of Article

You may also like