మృతి చెందడానికి ముందు పన్నెండళ్ళ బాలికను కాపాడిన ఎమ్మెల్యే లాస్య నందిత.. ఏం జరిగిందంటే..?

మృతి చెందడానికి ముందు పన్నెండళ్ళ బాలికను కాపాడిన ఎమ్మెల్యే లాస్య నందిత.. ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

బీఆర్‌ఎస్‌ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మూడు రోజుల క్రితం ఓఆర్‌ఆర్‌ పై పటాన్‌ చెరు దగ్గర జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.  ప్రమాదమే అయినప్పటికీ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Video Advertisement

పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ జరుపగా,  లాస్య నందిత తల్లి కీలక కామెంట్స్ చేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తన కుమార్తె మరణించిందని ఆరోపణలు చేసింది. ఇంకో వైపు లాస్య నందిత యాక్సిడెంట్ వల్ల చనిపోలేదని, హత్య  అని, గతంలో కూడా లాస్య పై 2 సార్లు దాడి చేయడానికి ప్లాన్ చేశారని ఒక లాయర్ ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పడం చర్చకు దారి తీసింది.

తాజాగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య మృతి పై ఒక వార్త బయటికి వచ్చింది. లాస్య నందిత మరణం పై పోలీసులు రివర్స్ ఇన్వెస్టిగేషన్ సైతం చేశారు. యాక్సిడెంట్ కు ముందు లాస్య నందిత చేసిన ఒక పని పన్నెండేళ్ళ బాలికను యాక్సిడెంట్ కు గురి కాకుండా చేసింది. సదాశివాపేట్ నుండి లాస్య , ఆమె సోదరి కుమార్తె (12 ఏళ్ల బాలిక), డ్రైవర్ ఆకాష్ ఒక కారులో వెళ్తుండగా, మరో కారులో లాస్య నందిత తల్లి మరియు సోదరి ప్రయాణిస్తున్నారు.

అయితే లాస్య ఆమె తల్లికి ఫోన్ చేసి వారిని కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఆగమని చెప్పింది. అక్కడికి వచ్చిన తరువాత లాస్య  ఆకలిగా ఉందని, తను టిఫిన్ తిని, వారికి కూడా తీసుకొస్తానని చెప్పి, తన కారులో ఉన్న సోదరి కుమార్తెను తన తల్లి ఉన్న కారులోకి ఎక్కించింది. ఆ తరువాత కారులో బయలుదేరిన 21 నిమిషాలకే యాక్సిడెంట్ కు గురై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం పై డ్రైవర్‌ ఆకాశ్‌ను విచారించగా, ఆ క్షణం బ్లాంక్ గా ఉందని, అప్పుడు ఏం జరిగిందనే విషయం తనకు గుర్తుకు లేదని చెప్పినట్టుగా పోలీసులు వెల్లడించారు.

Also Read: యాక్సిడెంట్ లో షాకింగ్ విషయాలు.. గడిచిన 2 నెలలలో 3 సార్లు..!


End of Article

You may also like