Ads
- చిత్రం : హ్యాపీ బర్త్ డే
- నటీనటులు : లావణ్య త్రిపాఠి, సత్య, వెన్నెల కిషోర్.
- నిర్మాత : చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
- దర్శకత్వం : రితేష్ రాణా
- సంగీతం : కాల భైరవ
- విడుదల తేదీ : జులై 8, 2022
Video Advertisement
స్టోరీ :
డిఫెన్స్ మినిస్టర్ రిత్విక్ సోధి (వెన్నెల కిషోర్) ఇండియాలో తుపాకీ చట్టాలని సవరించాలి అని అనుకుంటూ ఉంటారు. దీని తర్వాత తుపాకీలు వాడడం అనేది ఎక్కువైపోతుంది. ప్రతి వాళ్ల చేతిలో తుపాకీ లేదా రైఫిల్ ఉంటుంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో రిట్జ్ హోటల్ లో హౌస్ కీపర్ (నరేష్ అగస్త్య) ని హోటల్ లో ఉండే లైటర్ స్థానంలో పెట్టడానికి నియమిస్తారు. తర్వాత పసుపులేటి హ్యాపీ త్రిపాఠి (లావణ్య త్రిపాఠి) ఒక పబ్ లో ఇరుక్కొని కిడ్నాప్ అవుతుంది. హ్యాపీని ఎవరు కిడ్నాప్ చేశారు? సినిమాలో ఉన్న పాత్రల్లో ఒకరికి ఒకరికి సంబంధం ఏంటి? అసలు హ్యాపీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది? చివరికి వీరందరూ ఎలా కలిశారు? వీరి సమస్యలు ఎలా పరిష్కరించుకున్నారు? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
దర్శకుడు రితేష్ రాణా అంతకు ముందు మత్తు వదలరా సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటివరకు తెలుగులో ఇలాంటి సినిమాలు రాలేదు అని చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాని ప్రశంసించారు. ఇప్పుడు ఆ సినిమాలో కనిపించిన కొన్ని పాత్రలు కూడా హ్యాపీ బర్త్ డే ట్రైలర్ లో కనిపించారు. సినిమా ఒక కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. సినిమా కూడా అలాగే నడుస్తుంది. కొన్ని జోక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ కొన్ని జోక్స్ మాత్రం ఇది ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముంది అన్నట్టు అనిపించాయి. కొన్ని పంచ్ లైన్స్ కూడా నవ్వు తెప్పించేలాగా ఉన్నాయి.
సినిమా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంది. అలాగే సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేసేలాగా నటించారు. కానీ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలాగా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే అసలు ఏం జరుగుతోంది అనే విషయం కూడా అర్థం అవ్వదు. కొన్ని జోక్స్ ఉన్న కూడా సీన్స్ మాత్రం చాలా బోరింగ్ గా కొన్ని మాత్రం విసుగు వచ్చేలాగా అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
- కామెడీ
- నిర్మాణ విలువలు
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
- హీరోయిన్ పాత్ర చిత్రీకరించిన విధానం
- ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సీన్స్
- క్లైమాక్స్
- బోరింగ్ గా అనిపించే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి పెద్దగా ఏమీ ఆశించకుండా, ఏదైనా ఒక డిఫరెంట్ సినిమా చూద్దాం అనుకునేవారు, ఎలా ఉన్నా సరే కామెడీ సినిమా చాలా రోజులు అయ్యింది, అలాగే కథ ఎలా ఉన్నా సరే సరదాగా ఏదైనా సినిమా చూద్దాం అనుకునేవారు హ్యాపీ బర్త్ డే ఒకసారి చూడొచ్చు.
End of Article