బిగ్ బాస్ విన్నర్ తో మెగా కోడలు వెబ్ సిరీస్…

బిగ్ బాస్ విన్నర్ తో మెగా కోడలు వెబ్ సిరీస్…

by Mounika Singaluri

Ads

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా కోడలు అయిన సంగతి తెలిసిందే. మెగా కోడలిగా తన బాధ్యతలను ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తుంది.

Video Advertisement

పెళ్లి తర్వాత ప్రస్తుతం లైఫ్ ఎంజాయ్ చేస్తుంది ఈ భామ. ఇటీవల భర్త వరుణ్ తేజ్ తో కలిసి హనీమూన్ వెళ్లొచ్చింది. అక్కడి ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. ఇక హనీమూన్ తర్వాత ఈ భామ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంది.

ఇక తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఇవే అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కూడా. తనని తాను ప్రేమించుకోవాలి.. హ్యూమన్ బియింగ్ గా ఉండాలి.. సోషల్ మీడియాకు తక్కువగా టైం కేటాయించాలి అంటూ మూడింటిని రిజల్యూషన్స్ గా పెట్టుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమవుతుంది అనుకున్నా లావణ్య అందరికీ షాక్ ఇస్తు తన తదుపరి వెబ్ సిరీస్ ఇటీవల ప్రకటించింది.

బిగ్ బాస్ తెలుగు 4 విన్నర్ అభిజీత్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతుంది. ఇక ఈ సిరీస్ కు ‘మిస్ పర్ఫెక్ట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక ఈ సిరీస్ త్వరలో రానుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.ఈ సిరీస్ నున్కామెడీ డ్రామాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. త్వరలో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ప్రమోషన్స్ తో లావణ్య ప్రేక్షకుల ముందుకి రానుందట. దీన్ని బట్టి చూస్తే పెళ్లి తర్వాత లావణ్య సినిమాలను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది.


End of Article

You may also like