భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక 32 యేళ్ళ మహిళ ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది.చనిపోయే ముందు తన మరణానికి గల కారణాలు వివరిస్తూ ఒక వీడియో చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు.కాగా ఆ వీడియో వైరల్ గా మారింది. 32 యేళ్ళ లావణ్య అనే మహిళ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.అయితే 8 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర రావు అనే పైలట్ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.

Also watch: “చచ్చేదాకా ప్రేమించాలనుకున్నా..కానీ?” లావణ్య చివరి మాటలు వింటే కన్నీళ్లొస్తాయి.!

ఇది ఇలా ఉంటె…ఈ కేసులో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి…  వెంకటేశ్వర్‌రావు మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా లావణ్యకి  దొరికిపోయాడు. దీంతో లావణ్య అతడిని నిలదీసింది. ఆ తర్వాత నుండి వెంకటేశ్వర్‌రావు లావణ్య ముందే ఆమెతో వీడియో కాల్స్, చాటింగ్ చేసేవాడు. భార్య గర్భవతి అని కూడా చూడకుండా గతంలో కొట్టగా గర్భస్రావం అయినట్లు తెలుస్తోంది.

ఉద్యోగం పేరుతో భార్యను ఒంటరిగా వదిలి మరో మహిళతో విదేశాల్లో తిరిగిన విమాన టికెట్లు, వాట్సాప్‌ చాటింగ్‌లను లావణ్య తన ఫోన్ లో ఆధారాల కోసం భద్రంగా పెట్టుకున్నట్లు సమాచారం. ‘నా జీవితాన్ని నాశనం చేయవద్దు’ అని సదరు యువతిని లావణ్య వేడుకుందని. అది తెలుసుకున్న ఆమె భర్త మరింతగా చిత్రహింసలు పెట్టాడంట.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అసలు రూపం తెలుసుకుని మనస్తాపం చెందారు లావణ్య. ఆత్మహత్య చేసుకునేందుకు పై అంతస్థుకు వెళ్లిన భార్యను అక్కడే ఉన్న వెంకటేశ్వర్‌రావు అడ్డుకోలేదంట మరోవైపు తమ కూతురిని వెంకటేశ్వర్‌రావు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడన్నారు. ఈ కేసులో వెంకటేశ్వర్ రావును పోలీసులు అరెస్ట్ చేసారు. లావణ్య అత్తామామలను పట్టుకునే పనిలో ఉన్నారు.

లావణ్య చనిపోయే ముందు వీడియోలో మాట్లాడుతూ..అమ్మ, నాన్న మీరు నాకు ఎంతో ప్రేమను అందించారు.అందరు ప్రేమించే దానికంటే మీరు నన్ను ఎక్కువ ప్రేమించారు నాన్న అని లావణ్య అన్నారు.అదే విధంగా నేను నా భర్తను కూడా ప్రేమించాను అందుకే ఆత్మహత్య కు పాల్పడుతున్నాను అని అన్నారు.నాకు నా భర్త అంటే ఇష్టం కాబట్టి నేను నా భర్త మీద పోలీస్ కేసు పెట్టలేదు అని అన్నారు.నా భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అది నన్ను ఎంతగానో బాధించింది అని లావణ్య వీడియో లో తెలిపారు.అయితే లావణ్య మాట్లాడిన చివరి మాటలు అందరిని ఎంతో భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

Follow Us on FB:


Sharing is Caring: