*ఎల్.బి. నగర్ ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ హృదయపూర్వక విజ్ఞప్తి: సుధీర్ రెడ్డి*

*దయచేసి ఈ👇అంశాన్ని ప్రతి ఒక్కరు చదివి తమ తమ డివిజన్, కాలనీ అసోసియేషన్ గ్రూప్స్ లో షేర్ చేయగలరు*

కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్నది. ఇలా రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నవి. అయినా చాలా మంది ప్రజలు విచ్చలవిడిగా , అడ్డూ అదుపు లేకుండా తిరుగుతూనే ఉన్నారు. క్రమశిక్షణ లేదు, సామాజిక దూరం పాటించడం లేదు. గత కొద్ది కాలంగా కరోనా తీవ్రత వలన జరుగుతున్న , జరగబొవు నష్టాల గురించి Social Media ద్వారా నేను పోస్ట్ చేసిన విషయాల కంటే కరోనా బాధితుల సంఖ్య భయంకరంగా పెరుగుతూనే ఉంది. పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతూనే ఉన్నాయి. ఉదాహరణకు మన నియోజక వర్గంలొని సరూర్ నగర్ ప్రాథమిక ఆరోగ్యశాలలో గత నాలుగు రోజుల్లో చేసిన పరిక్షలలో ఇంచు మించుగా 300 కరోనా పాసిటివ్ కేసులు వచ్చాయి. చేసిన పరిక్షలఫలితాలలో పాజిటివ్ శాతం 22. మీ శాసనసభ్యునిగా నేను ఇంట్లో ఉండలేను. ప్రజలను వారి దారిన వారిని వదిలిపెట్టలేను. కరోనా విజృంభన వలన వారి కుటుంబాలు ఎలా అవస్థలు పడుతున్నాయో, మన సమాజం ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో పూస గుచ్చినట్టు గతంలోనే నా పోస్టింగుల ద్వారా విడమరచి చెప్పినా అయినా వినే నాథుడె లేడు. 15 రోజుల క్రితమే స్పష్టంగా చెప్పాను, కరోనా మహమ్మారి ఎలా తీవ్రరూపం దాల్చ బోతుందోనని. ఊహాజనిత లెక్కలు చెప్పాను. సెప్టెంబరు లోగా GHMC పరిధిలో రోజుకు 5 వేలు కరోనా కేసులు వస్తాయని చెప్పాను. కాని నెల రోజుల్లోనే ఆ కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్స్ పూర్తిగా నిండిపోయినాయి. టాప్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో అనగా యశోద, కేర్, గ్లోబల్, Continental , స్టార్ హాస్పిటల్స్, వాటి అన్ని బ్రాంచీలు మరియు దిగువశ్రేణి హాస్పిటల్స్ లో అన్ని బెడ్స్ ఫుల్ గా నిండిపోయినవి. ఇక రేపటి రోజుల్లో అంత పెద్ద ఎత్తున వస్తున్న పాజిటివ్ పేషంట్లను ఎవరు అడ్మిట్ చేసుకుంటారు? ఎవరు చికిత్సలు చేయాలి? రోజు రోజుకు విభృంజిస్తున్న తీవ్రతను, దాని దుష్ఫలితాలను ప్రజలు అర్దం చేసుకోవడం లేదు. మాస్కులు ధరిస్తున్నం కదా, రక్షణ ఉంది కదా! ఇంకా మాకు కరోనా అంటదు అనే భ్రమలో ప్రజలు ఉన్నారు. మాస్కులు ధరించడం వలన కేవలము 30% కరోనాను నివారించవచ్చు, 30% సామాజిక దూరం పాటించడం వలన, 30% కొత్త వ్యక్తులను మరియు కొత్త వస్తువులను తాకకుండా ఉండటం మరియు సరిగ్గా శుభ్రంగా ఉంచుకోవడం, మిగిలిన 10% ఇమ్యునిటీ పెంచుకోవడం వలన. ఇవన్నీ ఒక పద్ధతిగా పాటించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమే!

ప్రస్తుతం నా భయం ఏమిటంటే ఏ హస్పిటల్స్ లో కూడా బెడ్లు దొరకడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులలో సగానికి సగం డాక్టర్స్, నర్సులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్దారు.ఈ విధంగా కరోనా వ్యాప్తి చెందుతుంటే, వేలు, లక్షల పాజిటివ్ కేసులు వస్తుంటే ఎలా చికిత్సలు జరుగుతాయి ? భవిష్యత్ అగమ్య గోచరంగా ఉంది. ప్రభుత్వం చేయ గలిగినధంతా చేస్తూనే ఇన్నది. కానీ హాస్పిటల్స్ లో బెడ్లు పూర్తీగా నిండిపోయినవి. ప్రజలు ప్రభుత్వానికి సహకరించక పోతే ఎవరు ఏమి చేయగలరు. భవిష్యత్తు ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. 15 రోజుల క్రితము నేను మీకు చెప్పింది అలాగే జరుగుతున్నది. పర్యవసనాలు అతి తివ్రంగా ఉంటాయి. మన సమాజం మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతుంది. మీకందరికి చేతులెత్తి దండం పెడతా…. మొదటగా మనకు మనం రక్షించుకోవాలి. దీని కోసం మనకు మనం ఆంక్షలు విధించుకోవాలి.

కొద్ది రోజుల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఓ టాబ్లెట్(ఫాబిఫ్లూ), ఓ ఇంజేక్షన్ మార్కేట్ లోనికి వచ్చాయి. అది మొదటి దశ, మద్యస్త దశలలో ఉన్న కరోనా రోగుల చికిత్సకు ఉపయోగపడతాయి. కరోనా తీవ్రo అవుతున్న ఈ దశలో కనీసం 6-8 నెలలు మనకు మనం కాపాడుకోకుంటే అంతా అగమ్య గోచరమే ! భవిష్యత్తు అంతా ప్రశ్నార్ధకమే! అంధకార భందురమే!ప్రజా ప్రతినిధిగా నేను క్రమశిక్షణతో ఉంటూ అభివృధి కార్యక్రమాలలో పాల్గోనే కార్యకర్తలు, ప్రజలు క్రమశిక్షణతో ఉండే విధంగా, ఉంచాల్సిన, చూడల్సిన భాద్యత నాది. కాని ఎవరు పాజిటివ్ గా స్పందించడం లేదు. ఎంత చెప్పినా కార్యకర్తలు, ప్రజలు ఆగడం లేదు. వారందరికి కరోనా అంటకుండా చూడాల్సిన భాద్యత కూడా నాదే. కాని నా విఙప్తులను ఎవరు అర్ధం చేసుకోవడం లేదు. ఇటు ఎల్.బి.నగర్ ను అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్ళాలి, అటు కార్యకర్తలను, ప్రజలను కరోనా నుండి కాపాడుకోవాలి . ఇదే నా లక్ష్యం. కాని వారు కరోనాను ఒక సాధారణ వైరస్ గా తీసుకుంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసినప్పటి నుండి సామాజిక దూరం, క్రమశిక్షనలు అసలే పాటించడం లేదు.

ప్రజప్రతినిధులు ఇంట్లో కూర్చోకూడదు. ప్రజల కష్ట సుఖాల్లో, సమస్యల పరిష్కారంలో నిరంతరం కృషి చేయలి, పాలుపంచుకోవాలి. అసలు నేనూ ప్రజల లోనికి రావాలా , వద్దా. ఇంట్లో కూర్చోవాలా ? మీరందరూ బాగా ఉండాలనే నా తాపత్రయం. కావున మీరందరు discipline గా ఉండాలి. లేక నేను ప్రొగ్రాములు స్టాప్ చేయలా? అర్ధంకావడం లేదు. సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా, శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నాను. ఈ విషయములో compromise అయ్యే ప్రసక్తే లేదు. ఫలనా MLA గారి ప్రోగ్రాం ద్వారా ఇంతమందికి, అంతమందికి కరోనా వచ్చింది, అంటే నాకు ఎంతటి భాధకరమైన విషయం. మీరే ఆలోచించండి. అందుకే ఒక్కో ప్రోగ్రాంకు కార్పొరేటర్, డివిజన్ ప్రెసిడెంట్ నేను, ఇంకో కార్యకర్త నలుగురం , సంఘ అధ్యక్ష కార్యదర్శులు, మరో ఇద్దరు మొత్తం 8 మంది మాత్రమే హాజరైతే చాలు. ఇది మీ అందరి ఆరోగ్య భవిష్యత్తు కోసమే. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం అభివృద్ది జరగడమే కాని ,ఎక్కువ మంది అటెండ్ కావడం కాదు.

Protection, Prevention of Coronavirus Covid-19

ఒక్క సరూర్ నగర్ లోనే ప్రతి రోజు 250-300 మందికి కరోనా
పరిక్షలు జరుగుతూ ఉంటే, హైద్రబాద్ లో ఇంచు మించు గా 40 ప్రాథమిక ఆరోగ్య సెంటర్లలో ఎన్ని వేల పరిక్షలు జరుగుతూ ఉన్నాయి.రాష్టంలో ఎన్ని జరుగుతున్నాయి? ఎన్ని పాసిటివె కేసులు వస్తున్నాయి? ఒక్క కుటుంబంలో ఒక పాసిటివ్ కంపర్మ్ అయితే మిగతా కుటుంబ సభ్యులందరు హద్దు, అదుపు లేకుండా తిరుగుతూ ఉంటే ఎంతవరకు సమంజసం? హోం క్వారంటైన్ చేసుకునే కనీస భాధ్యత తీసుకొకుంటే ఎలా? అలాంటి వారందరు కచ్చితంగా క్వరంటైన్ చేసుకోవాలి, ప్రభుత్వానికి సహకరించాలి . గతంలో లాగా ఒక్క ఇంటిలో ఒక్క పాసిటివ్ కంఫర్మ్ అయితే GHMC వారు ఆ రోడ్డు మొత్తానికి కంటైన్మెంట చేసేవారు.

nurses problems in india

వారందరికి ఉచిత సేవలు అందించే వారు. ఇప్పుడు ఆ ఇంటికి మాత్రమే containment చేస్తున్నారు. ఈ మధ్యన మన నియోజక వర్గంలో ఓ మూడు కుటుంబాలకు కరోనా టెస్టుల్లో నెగటివ్ వచ్చింది. 5 – 6 రోజుల తర్వాత వారందరికి పాజిటివ్ వచ్చింది. మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి , ఎలా మసలు కోవాలి అనే కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా ?మన GHMC సర్కిల్లలో కూడా సిబ్బందికి కరోనా సొకింది. వారు రేపు ఆ మాత్రం సేవలు చేయడానికి కూడా సిబ్బంది మిగులుతారని ఆశలు లేవు. అందుకే కఠినమైన స్వీయ నియంత్రణ చేసుకోవాలి. అభివృద్ది కార్యక్రమాల్లో కార్యకర్తలు, ప్రజలు దగ్గర దగ్గరగా ఉంటే ఎవరైనా ఉన్నవాళ్ళ దగ్గర నుండి, లేని వాళ్ళకు కరోనా వ్యాప్తి జరుగుతుందేమోనని నాకు భయంగా ఉంది.

Hyderabad:

GHMC పరిధిలో లేటెస్టుగా వ్యాపారాలు చేసుకునే వర్గాల వారికి కరోనా సోకి , కొందరు చని పోవడం వలన పెద్ద పెద్ద వ్యాపార కూడళ్లు అయిన బేగం బజార్, ట్రూప్ బజార్, Secunderabad general bazar ఈ రోజు నుండి స్వచ్చందంగా మూత పడ్డాయి. కొన్ని రోజుల్లో అన్నీ close అవుతాయి. మళ్లీ లాక్ డౌన్ విధించడానికి ప్రజలు ప్రభుత్వానికి గత్యంతరం లేని పరిస్థితులు కల్పిస్తున్నారు.అందువలన దయ చేసి అభివృద్ధి కార్యక్రమాలలో పైన తెలిపిన విధంగా ఓ 8 మంది మాత్రమే అటెండ్ అవుదాం. మీ రోజు వారి , మీ దినసరి కార్యక్రమాల్లో, మీ మీ విధుల్లో పద్ధతిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ , కొత్త వ్యక్తులను – కొత్త వస్తువులను తాక కుండా జాగ్రత్తలు తీసుకుంటూ , మీ జీవన శైలిని ఇప్పటి పరిస్థితుల కనుగుణంగా మార్చుకుంటూ, కరోనా నివారణ మహాయజ్ఞములో భాగ్యస్వామ్యులు కండి , మిమ్ములను కాపాడుకుంటూ , మీ కుటుంబాలను కాపాడుకోండి ! అని మీకు చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, విఙప్తి చేస్తున్నా..

ఇట్లు
మీ సేవకుడు
దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
చైర్మన్,MRDCL & ఎమ్మెల్యే

*ఎల్.బి. నగర్ ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేస్తూ హృదయపూర్వక విజ్ఞప్తి: సుధీర్ రెడ్డి* *దయచేసి ఈ👇అంశాన్ని ప్రతి ఒక్కరు…

Posted by D Sudheer Reddy on Friday, June 26, 2020

Follow Us on FB:


Sharing is Caring: